Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘కిష్కింధపురి’ హారర్ థ్రిల్లర్ చిత్రంగా తెలుగు ప్రేక్షకులను భయపెట్టబోతుంది.ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు ‘చెక్’, ‘ఆర్ ఎక్స్ 100’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు అందాల నటి అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించనున్నారు. వీరి కెమిస్ట్రీ ఈ సినిమాలో క హైలైట్‌గా నిలుస్తుందని అంచనా. ఈ చిత్రాన్ని సాహు గరపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో రూపొందుతోంది.‘కిష్కింధపురి’ చిత్రం ఒక ప్రత్యేకమైన హారర్-మిస్టరీ ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ గ్లింప్స్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఒక పాడుబడిన భవనం ‘సువర్ణమాయ’లోకి ప్రవేశించడం, ఆ తర్వాత అనేక భయానక సంఘటనలు జరగడం చూపించారు. “కొన్ని తలుపులు తెరవకూడదు” అనే ట్యాగ్‌లైన్‌తో, ఈ టీజర్ ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది. సామ్ సిఎస్ రూపొందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు మరింత థ్రిల్‌ను జోడించింది.
Read also- Khammam Tragedy: శవంగా తమ్ముడు.. రాఖీ కట్టిన అక్క.. గుండెలు పిండేసే దృశ్యాలు
‘చుక్కలకు చుట్టానివా.. మబ్బులకు సంద్రానివా నింగినెల జారెవేసే వర్షానివా వర్ణానివా’ అంటూ మొదలయ్యే పాటలో మంచి లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో, హీరోయిన్ కలిసి బీచ్ లో వేసిన స్టెప్పులు బాగున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. సంగీతం కూడా సరళమైన లిరిక్స్ కి తగ్గట్టుగా అందించారు మ్యూజిక్ డైరెర్టర్. విజువల్స్ చూస్తుంటే చాలా ప్రెష్ గా కనిపిస్తున్నాయి. లోకేషన్స్ కూడా చాలా నేచురల్ గా అనిపించాయి.నిర్మాణ విలువలు అయితే హై నాచ్ లో ఉన్నాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుంగా సినిమాను నిర్మించినట్టు ఉన్నారు నిర్మాతలు. ఈ పాటను చూస్తే ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి.
Read also- CPI Narayana: ఆ విషయం చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంతు చూస్తా అంటూ వార్నింగ్!
సినిమా నుంచి మొదటి సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’విడుదలై సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను జావేద్ అలీ ఆలపించగా, పూర్ణ చారి సాహిత్యం అందించారు, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఈ పాట హారర్ నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథను సూచిస్తూ, చిత్రంలో ఎమోషనల్ డెప్తును జోడిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ‘కిష్కింధపురి’ విజువల్స్ గ్రాండ్‌గా, పాలిష్‌డ్‌గా కనిపిస్తున్నాయి, ఇది ఒక హై-క్వాలిటీ హారర్ అనుభవాన్ని అందిస్తుందని సూచిస్తోంది. రేడియో, ఒక ఆత్మ సంబంధిత రహస్యం వంటి అంశాలు కథలో కీలక పాత్ర పోషిస్తాయని గ్లింప్స్ సూచిస్తోంది. ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ శైలిలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉంది.