Hero Kiran Abbavaram
ఎంటర్‌టైన్మెంట్

Dilruba Bike: ‘దిల్ రూబా’.. స్టోరీ లైన్ చెప్పండి.. బైక్ పట్టండి

Dilruba Bike Contest: ‘క’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. ఈ సినిమాపై భారీగా అంటే భారీగా ఏం అంచనాలు లేవు కానీ, ఆ అంచనాలను తెప్పించడానికి, రప్పించడానికి టీమ్ బాగానే కష్టపడుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. రెండు మూడు వాయిదాల తర్వాత హోలీ పండుగను పురస్కరించుకుని మార్చి 14న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ లోపు ఎలాగైనా సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి ఇప్పుడో కాంటెస్ట్‌ని లైన్‌లోకి తెచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా వేదికగా ‘బైక్ కాంటెస్ట్‌’ అనౌన్స్ చేశారు. ఈ బైక్ సొంతం చేసుకోవాలంటే చేయాల్సింది ఏమిటంటే..

Also Read- Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ

బైక్ బహుమతిగా పొందాలంటే..
‘దిల్ రూబా’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లోనే స్టోరీ లైన్ దాగి ఉందట. అదేంటో కనిపెట్టి క్రియేటివ్‌గా చెప్పిన వాళ్లకు, ఈ సినిమా కోసమని ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్‌ని బహుమతిగా ఇస్తారట. అది మ్యాటర్. అసలు కిరణ్ అబ్బవరం ఈ వీడియోలో ఏం చెప్పారంటే.. ‘‘నాలోని కోపం, ప్రేమల సమ్మేళనంగా ‘దిల్ రూబా’ సినిమా రూపొందింది. ఈ బైక్ చూశారుగా. ఈ బైక్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రమించి ఈ బైక్‌ని తయారు చేశారు. ఇలాంటి బైక్ మార్కెట్‌లో ఎక్కడా మీకు లభించదు. అందుకే దీనిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ బైక్ మీ సొంతం కావాలంటే, మీరు చేయాల్సింది ఏమిటంటే, ఇప్పటి వరకు విడుదలైన ‘దిల్ రూబా’ ప్రమోషనల్ కంటెంట్ చూసి, ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటనేది క్రియేటివ్‌గా చెప్పాలి. ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడాలు ఏమీ లేవు. ఆడవాళ్లు ఈ బైక్ గెలిచి మీ బాయ్ ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఈ బైక్ గెలిచిన వారికి ప్రీ రిలీజ్ వేడుకలో ఇవ్వడమే కాకుండా, సినిమాకు ఇదే బైక్‌పై ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తాను’’ అని చెప్పుకొచ్చారు.

ప్లాన్ వర్కవుట్ అయిందిగా!
మరెందుకు ఆలస్యం.. ‘దిల్ రూబా’కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌ని తిరగేయండి. స్టోరీ లైన్‌ని క్రియేటివ్‌గా చెప్పేయండి. బైక్ పట్టేయండి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. బైక్ కూడా ఎక్స్‌లెంట్‌గా ఉంది. అది విషయం. మొత్తంగా అయితే ఈ బైక్ రూపంలో ఈ సినిమా అయితే వార్తలలోకి వచ్చేసింది. వారు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయినట్లుగానే భావించవచ్చు. కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకుడు.

ఇది కూడా చదవండి:
Priya Kommineni: ఈ ఖమ్మం చిన్నదాని కోరిక ఏంటంటే?

Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో ఇలా చేశారేంటి? నిరాశలో ఫ్యాన్స్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు