Harish Rai death: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు హరీష్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా ద్వారా ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త సినీ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. గత కొంత కాలంగా హరీష్ రాయ్ గొంతు క్యాన్సర్‌తో (Throat Cancer) బాధపడుతున్నారు. ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొంటూనే, ఆర్థిక కష్టాలను కూడా చవిచూశారు. ‘కేజీఎఫ్’ చిత్రంలో రాకీ భాయ్ (యశ్)కి నమ్మకమైన అనుచరుడు అయిన ఖాసిం (Khasim) పాత్రలో ఆయన నటించారు. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
Read also-Kaantha trailer: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా మరి..
వాస్తవానికి, ‘కేజీఎఫ్’ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ కారణంగా గొంతు వద్ద వచ్చిన వాపు కనిపించకుండా ఉండేందుకే ఆయన ఆ సినిమాలో పొడవాటి గడ్డం (Beard) పెంచారు. ఈ విషయాన్ని ఆయన తరువాత ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చికిత్స కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండటంతో, ఆర్థిక పరిస్థితి విషమించి, సహచర నటులు, దాతల సహాయం కోసం కూడా హరీష్ రాయ్ విజ్ఞప్తి చేశారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కన్నడ సినీ పరిశ్రమలో కొనసాగిన హరీష్ రాయ్ సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణం కన్నడ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Read also-Anunay Sood death: లాస్ వేగాస్‌లో ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి..
క్యాన్సర్ తో పోరాడుతున్న కష్ట కాలంలో సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు, ముఖ్యంగా కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ , యశ్ ఆయనకు ఆర్థికంగా సహాయం అందించారని, ఆ విషయాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘కేజీఎఫ్’ కాకుండా.. ఓం (Om – 1995), మజెస్టిక్ (Majestic – 2002), డెడ్లీ సోమ (Deadly Soma 2005), సంజు వెడ్స్ గీత (Sanju Weds Geetha 2011), చక్రవర్తి, బెంగుళూరు అండర్‌వరల్డ్, ‘ఆపరేషన్ అంఠా’, ‘నల్ల’, ‘పోలీస్ స్టోరీ 3’, ‘జింకె మారి’, ‘ది ప్లాన్’ వంటి సుమారు 30కి పైగా చిత్రాలలో నటించారు. హరీష్ రాయ్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని నటనను కొనసాగించిన నిబద్ధత గల నటుడిగా కన్నడ సినీ చరిత్రలో నిలిచిపోతారు.
