Karavali: కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) అతి తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకుని కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమా తర్వాత అలాంటి కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుందని మేకర్స్ భావించారు. అయితే ఆ స్థాయిలో రౌండ్ చేసిన సినిమా ఆ తర్వాత రాలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు మరో ప్రయత్నం జరుగుతోంది. ‘స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ’ చిత్రాల అద్భుతమైన విజయం అనంతరం కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి చేస్తున్న చిత్రం ‘కరవాలి’. దర్శకుడు గురుదత్ గనిగ ఈ సినిమాతో కర్ణాటక తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను తెరపైకి తీసుకు రాబోతోన్నారు. విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా, రాజ్ బి. శెట్టి (Raj B Shetty) మవీర అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ‘కరవాలి’ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా రాజ్ బి శెట్టికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Also Read- TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు.. నిర్మాత వివరణ
ఈ గ్లింప్స్‌లో రాజ్ బి శెట్టిని చూస్తుంటే.. ఓ శక్తివంతమైన పాత్ర తనదని అర్థమవుతోంది. ఈ గ్లింప్స్‌తో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో కథను చెప్పీచెప్పనట్టుగా చూపించారు. కానీ రాజ్ బి శెట్టి మాత్రం ‘మవీర’గా ఓ సూపర్ మెన్ తరహా పాత్రను పోషిస్తున్నట్టుగా అయితే అర్థమవుతోంది. రెండు గంభీరమైన గేదెల పక్కన నిలబడి ఉన్న తీరు, చేతిలోని ఆ కాగడ చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇందులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది.
ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా దర్శకుడు గురుదత్ గనిగ (Gurudatha Ganiga) మాట్లాడుతూ.. మేము ఈ సినిమా కథ రాసినప్పుడు, తీస్తున్నప్పుడు కూడా ఈ పాత్రను ఎవరు పోషిస్తారనేది తెలియదు. మొదటి టీజర్ విడుదల తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను హై టెక్నికల్ వేల్యూస్‌తో మరింత గొప్పగా తీయాలని అనుకున్నాం. ‘మవీర’ పాత్ర కోసం మేం చాలా మంది నటులను ప్రయత్నించాం. ఆ రోల్ మేము చెప్పిన వారందరికీ నచ్చింది, కానీ ఎవ్వరూ చేయడానికి ముందుకు రాలేదు. ఈ సినిమా తీరప్రాంత ఆచారాల నేపథ్యంలో ఉంటుంది. ఈ పాత్ర గొప్పదనాన్ని అర్థం చేసుకునే నటుడే కావాలని మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అప్పుడే రాజ్‌ని కలిసి ఈ కథ వివరించాను. కానీ అతను అప్పటికే అనేక కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘సో ఫ్రమ్ సు’ అనే సినిమా కూడా ఉంది. అయినా సరే నేను వదల్లేదు. ఐదు సమావేశాల తర్వాత ‘మీకు అభ్యంతరం లేకపోతే, మీరు చిత్రీకరించిన కొన్ని సీన్లను నేను చూడవచ్చా?’ అని అడిగారు. నేను అందుకు ఓకే చెప్పాను. ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఓకే అని ఒప్పుకున్నారు. చివరకు ఆయన మవీర అనే పాత్రకు ప్రాణం పోశారని చెప్పుకొచ్చారు.
Also Read- CPI Narayana: ఆ విషయం చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంతు చూస్తా అంటూ వార్నింగ్!
‘జంతువు వర్సెస్ మానవుడు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమా భావోద్వేగ, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మిత్రా, రమేష్ ఇందిరా, సంపద ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వీకే ఫిల్మ్ అసోసియేషన్, గనిగా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివర దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు