TG Vishwa Prasad: ప్రస్తుతం టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె (Cine Workers Strike)ను ఉద్దేశిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) సంచలన కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో స్కిల్స్ కూడా సరిగా లేవని ఆయన అన్నట్లుగా కొందరు కార్మికులు మీడియాకు వివరించారు. తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ వివరణ ఇచ్చారు. ‘నేను హైదరాబాద్ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదని గమనించగలరు’ అని తెలియజేశారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
Also Read- Allu Arha: ‘నువ్వు తెలుగేనా?’.. మంచు లక్ష్మికి షాకిచ్చిన అల్లు అర్హ! వీడియో వైరల్!
‘‘తెలుగు సినిమా పరిశ్రమ, హైదరాబాద్ ప్రతిభ, ఎంట్రీ ఫీజులపై నా స్పష్టమైన అభిప్రాయం:
హైదరాబాద్ టాలెంట్ గురించి: హైదరాబాద్‌లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో, మా ప్రొడక్షన్స్‌లో చేస్తున్న సినిమాలతో కలిపి సుమారు 60 నుంచి 70 శాతం వరకు పని చేసే బృందం హైదరాబాద్ నుంచే వస్తోంది. వీరి పాత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకం.
ఎంట్రీ బారియర్స్ అండ్ స్కిల్ గ్యాప్: గతంలో 10 శాతం ఉన్న స్కిల్ గ్యాప్ ఇప్పుడు 40 శాతం వరకు పెరగడం కేవలం ప్రతిభ ఒక్కటే లేకపోవడం కాదు.. అసలు కారణం కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పరిశ్రమలోకి రానివ్వకుండా రూ. 5 నుంచి రూ. 7 లక్షల వరకు అక్రమంగా డిమాండ్ చేసే గ్రూపుల వల్ల. నిజమైన టాలెంట్, స్కిల్ ఉన్న వాళ్లకు ఇది ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇవి కృత్రిమ అడ్డంకులు.
ఇండస్ట్రీ అనుబంధం: ఇండస్ట్రీతో అనుబంధం అనే దానిపై నేను ప్రత్యేకంగా మాట్లాడటానికి కారణం.. కొత్త ప్రతిభ రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తూ, కేవలం తమ సొంత లాభాల కోసం వ్యవస్థను నియంత్రించే గ్రూపులపై. ఇది పరిశ్రమ లాంగ్ జర్నీలో కూడా చాలా నష్టదాయకం.
Also Read- CPI Narayana: ఆ విషయం చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంతు చూస్తా అంటూ వార్నింగ్!
లోకల్ టాలెంట్‌కి మద్దతు: ఇప్పటికే మేజార్టీ టీం హైదరాబాద్ నుంచే వస్తోంది. మిగిలిన గ్యాప్ కూడా ఇక్కడి ప్రతిభతోనే నింపాలి. అవకాశాలు కల్పించాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి. బాహ్య నియామకాలపై ఆధారపడకుండా, ఇక్కడి టాలెంట్‌కే మద్దతుగా ఉండాలి.
క్లారిఫికేషన్ (స్పష్టత): నేను హైదరాబాద్ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు.
కంక్లూజన్: హైదరాబాద్‌లో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పటి నుంచో అండగా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలి.. మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలి.. వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన బాధ్యత. ఇదే మన పరిశ్రమ భవిష్యత్తుకు అవసరం..’’ అని పేర్కొన్నారు.
Producer T.G. Vishwa Prasad garu responds to recent misreadings concerning the Telugu film industry, Hyderabad-based talent, and issues of entry barriers.#TeluguFilmIndustry #TGVishwaPrasad #PeopleMediaFactory pic.twitter.com/vZL0YqLwJ9
— People Media Factory (@peoplemediafcy) August 7, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు