Kantara Chapter 1: 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమా ఇండియన్ సినిమా పరంగా సరికొత్త దిశగా అడుగు వేసింది, వేయించింది. సంవత్సరంలోనే అతిపెద్ద స్లీపర్ హిట్‌గా నిలిచిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 14 కోట్లతో తెరకెక్కి దాదాపు రూ. 450 కోట్లను కొల్లగొట్టింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకుగానూ రిషభ్ శెట్టి (Rishab Shetty) నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ‘కేజీఎఫ్, సలార్, కాంతార’ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన హోంబలే ఫిలింస్ బ్యానర్‌కు ఇది ఇంకో గొప్ప మైలురాయి అయ్యింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై ఎటువంటి అంచాలను ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి రిషబ్ శెట్టి ఎప్పుడూ చూడని థ్రిల్లింగ్ అవతార్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు, రిషబ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా అనౌన్స్ చేశారు.
Also Read- NTR War 2: ‘వార్ 2’పై అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్… హృతిక్ రోషన్‌తో యాక్షన్‌కు రెడీ!
లక్షలాది మందిని అలరించిన మాస్టర్ పీస్ ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీక్వెల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కొత్తగా విడుదలైన పోస్టర్ ఉత్సాహాన్ని, అంచనాలను మరింతగా పెంచేస్తుంది. రిషబ్ శెట్టి, అతని అభిమానులకు ఇది పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ‘కాంతార: చాప్టర్ 1’ లక్షలాది మందిని అలరించిన లెజెండ్ మూలాలకు ఆడియన్స్‌ని తీసుకెళుతుంది. ఈ పోస్టర్‌లో ఒక చేతితో గొడ్డలి, మరో చేతిలో డాలుతో పవర్ ఫుల్ లుక్‌లో రిషబ్ దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్‌తో అంతా మరోసారి కాంతార చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక ఈ పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మేకర్స్..
Also Read- Renu Desai: రెండో పెళ్లి.. మరోసారి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
‘‘కాంతార చిత్రం లక్షలాది మందిని కదిలించిన మాస్టర్ పీస్‌కి ప్రీక్వెల్ ఇది. లెజెండ్ వెనుక ఉన్న ట్రైల్‌బ్లేజింగ్ ఎనర్జీ రిషబ్ శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డివైన్ సినిమాటిక్ విజువల్ వండర్ మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్, ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం 2 అక్టోబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది’’ అని పోస్ట్ చేశారు. మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో సినిమా కొత్త పోస్టర్ ‘కాంతారా: చాప్టర్-1’ చుట్టూ ఉన్న ఉత్సాహం మరింతగా పెరిగింది. హోంబాలే ఫిల్మ్స్ విజన్, రిషబ్ శెట్టి అంకితభావం, ఫస్ట్ చాప్టర్ లెగసీతో ఈ చిత్రం మరో సినిమాటిక్ మైలురాయిగా మారే అవకాశం లేకపోలేదు. 2022లో వచ్చిన ఈ మాస్టర్ పీస్ లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో హోంబాలే ఫిల్మ్స్ రాజీపడటం లేదని తెలుస్తోంది. కాంతారా చాప్టర్-1 కోసం జాతీయ, అంతర్జాతీయ టెక్నిషీయన్స్‌తో యుద్ధ సన్నివేశాలను రూపొందించినట్లుగా తెలుస్తోంది. 500 మందికి పైగా ఫైటర్లు, 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 25 ఎకరాల్లో ఓ టౌన్ సెట్ వేసి, దాదాపు 45 నుంచి 50 రోజుల పాటు షూటింగ్ చేశారని, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ సీన్‌గా నిలిచిపోతుందని మేకర్స్ అంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు