Renu Desai: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai).. మరోసారి తన రెండో పెళ్లిపై మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రేణు దేశాయ్ దగ్గరయ్యారు. ఆ సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కొన్నేళ్లు సహజీవనం చేసి, 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వారికి అకీరా నందన్ ఉన్నాడు. అనూహ్యంగా 2011లో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజెనొవా (Anna Lezhneva)ను మరో పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్ మాత్రం అలాగే ఉండిపోయారు. అయితే 2018లో రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకుంటున్నానని ప్రకటించిన కొద్ది రోజుల్లోని అది రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ ఏ ఇంటర్యూకి వెళ్లినా తన రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా రేణు దేశాయ్ ఇదే విషయంపై మరోసారి స్పందించారు.
Also Read – Mobile Recharge: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు
మీడియా వేదికగా రేణు దేశాయ్ రెండో పెళ్లిపై స్పందిస్తూ… మరి కొన్ని సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటానన్నారు. ఇప్పటి వరకు తన పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోకుండా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకుంటే ఏమీ తెలియని తన పిల్లలు అకీరా, ఆద్యలు ఒంటరితనం ఫీల్ అవుతారని, వారికి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే పెళ్లి చేసుకోలేదన్నారు. ఇప్పుడిప్పుడే వారు కొత్త ప్రపంచం గురించి తెలుసుకుంటున్నారు. వారికి అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి.. మరికొన్ని సంవత్సరాల్లో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందన్నారు. తన పిల్లలే స్వయంగా ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో.. వారిని పెళ్లి చేసుకోవాలని కోరినట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. వారే స్వయంగా తనను పెళ్లి చేసుకోమనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడయితే వాళ్లు కాలేజీకి వెళ్లి కొత్త విషయాలు తెలుసుకోవడం మొదలు పెడతారో అప్పుడే తాను మరో కొత్త జీవితం గురించి ఆలోచిస్తానన్నారు.
Also Read – Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఆరోజే విడుదల.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాడట!
రేణు దేశాయ్ నటిగా ప్రయాణం మొదలు పెట్టి, నిర్మాతగా, దర్శకురాలిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఇప్పుడు తన పిల్లల కోసం చేసిన త్యాగం మరువలేనిదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కుటుంబ బాధ్యతే కాకుండా సామాజిక బాధ్యతపై కూడా ఆమె స్పందిస్తూ.. సమాజానికి అవసరమైన ప్రతి విషయంపై తనదైన తరహాలో పోస్ట్‌లు చేస్తుంటారు. అలాగే ఆమె ఓ చారిటీని కూడా నడుపుతున్నారు. నోరులేని జీవాల కోసం ఆమె ప్రత్యేకంగా ఓ హాస్పిటల్‌ను నడుపుతున్నారు. ఈ విషయంలోనూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది. 2014 లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ సినిమాతో దర్శకురాలయ్యరు. అదే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఓ తెలుగు సీరియల్‌లో అతిథి పాత్రలో కూడా కనిపించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్యూలో అకీరా నందన్ డెబ్యూ ఎప్పుడని యాంకర్ అడగ్గా… అకీరా ఎప్పుడు సినిమాల్లోకి వస్తానంటే అప్పుడు తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.