War 2 Movie Still
ఎంటర్‌టైన్మెంట్

NTR War 2: ‘వార్ 2’పై అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్టీఆర్… హృతిక్‌ రోషన్‌తో యాక్షన్‌కు రెడీ!

NTR War 2: ‘దేవర’ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘వార్ 2’. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ మూవీ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ‘వార్‌ 2’ గురించి ఎన్టీఆర్ అప్‌డేట్‌ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘వార్‌ 2’ చిత్రం పూర్తయిందంటూ చెప్పుకొచ్చారు. హృతిక్‌ రోషన్‌‌తో సెట్‌లో ఉన్నంతసేపూ చాలా సందడిగా ఉండేదన్నారు. ఆయన ఎనర్జీకి ఫిదా అయ్యానని, తాను కూడా అదే ఎనర్జీని పొందడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ జర్నీలో హృతిక్‌ రోషన్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అయాన్‌ ముఖర్జీ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరన్నారు. ఈ చిత్రానికి పని చేసిన ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌’ టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read – Chandrababu: ఎవ్వరినీ వదిలిపెట్లొద్దు.. సీబీఎన్ కీలక ఆదేశాలు

బాలీవుడ్‌లో రిలీజై మంచి హిట్ అందుకున్న ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందించారు. ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్‌లలో ‘వార్ 2’ రిలీజ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌లో విజువల్స్ హాలీవుడ్‌ను తలపిస్తున్నాయి. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ మధ్య యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని టీమ్ కూడా చెబుతోంది. ఆగస్టు 14 న ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ మూవీ కూడా విడుదలవుతుండటంతో రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొంది.

Also Read – America: అమెరికాలో ఘోరాతి ఘోరం.. హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం

‘వార్ 2’ సినిమాను తెలుగులో ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌ విడుదల చేయనుందని, ‘వార్ 2’ తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్మాత నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. తాను అభిమానించే తారక్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. ‘‘అరవింద సమేత వీర రాఘవ, దేవర.. సితార బ్యానర్‌పై విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్‌ 2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న ఉత్సవాలు చేసుకుందాం’’ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు