Kantara Chapter 1: పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ (Kantara) చిత్రానికి సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాపై నెలకొన్న హైప్‌ను మరింత పెంచుతూ, చిత్ర యూనిట్ భారీగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రీ-రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్న స్టార్ హీరో ఎవరో తెలియజేస్తూ.. తాజాగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..
Also Read- Nagababu: మా మనవడి రాక, ఓజీ గర్జన.. ఇక మా ఫ్యామిలీకి తిరుగులేదు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్
ఆ హీరో ఎవరో కాదు.. ‘కాంతార’కు సంబంధించి నెక్ట్స్ పార్ట్‌లో భాగం కాబోతున్నాడనేలా ఇటీవల వార్తలు వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR). రిషబ్ శెట్టి (Rishab Shetty)కి, ఎన్టీఆర్‌కి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్నేహం కారణంగానూ, అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్, నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్ర నిర్మాణ సంస్థే.. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటంతో.. ఆ నిర్మాణ సంస్థ కోరిక మేరకు, యంగ్ టైగర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నాడనేది తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ వేడుకకు వస్తే.. ఫ్యాన్స్ కూడా ఓ క్లారిటీ వస్తుంది. అదేంటంటే.. ఇటీవల ఎన్టీఆర్‌కు చిన్న యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. యాడ్ షూట్‌లో జరిగిన ప్రమాదంలో ఆయనకు చిన్న గాయాలు అయ్యాయని, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినట్లుగా వార్తలు వచ్చిన క్రమంలో.. తమ హీరో ఎలా ఉన్నాడనేది.. అభిమానులకు క్లారిటీ ఇచ్చినట్లు కూడా అవుతుంది.
Also Read- Viral Video: హెల్మెట్ పెట్టుకుని సైకిల్ తొక్కుతున్న చిలుక.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే!
విజువల్ వండర్
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించి, ప్రధాన పాత్ర పోషించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రాన్ని ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లోనూ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రీ సేల్స్ కూడా భారీ రేంజ్‌లో జరుగుతున్నాయి. మైథాలజీ, ప్రాంతీయ సంప్రదాయాలను అద్భుతంగా మిళితం చేయబోతున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్‌గా నిలవనుందనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరుకావడం సినిమా ప్రమోషన్స్‌కు మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్.. ఈ ‘కాంతార: చాప్టర్ 1’కు జాతీయ స్థాయిలో అదనపు మైలేజీని తీసుకొస్తుందని ఇరు హీరోల ఫ్యాన్స్ భావిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, ఈ ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ప్రీక్వెల్ అయినప్పటికీ, తొలి భాగం కంటే కూడా ‘కాంతార: చాప్టర్ 1’ కథ, సాంకేతిక విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
The stage is set for a historic convergence of LEGENDS 🔥
Man of Masses @tarak9999 will be gracing the Telugu Pre-release Event of #KantaraChapter1 on September 28th.
In Cinemas #KantaraChapter1onOct2 ✨#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG… pic.twitter.com/hhtPrIisVU
— Hombale Films (@hombalefilms) September 26, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు