Kantara Chapter 1: రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ మైథలాజికల్ డ్రామా నుంచి మేకర్స్ తాజాగా సినిమాలోని ‘బ్రహ్మ కలశ’ పూర్తి వీడియో సాంగ్ (Brahmakalasha Telugu Video Song)ను విడుదల చేశారు. ఈ భక్తి పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పాటలోని విజువల్స్, సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచాయి. తొలి భాగం ‘కాంతార’లోని ‘వరాహరూపం’ పాట ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో, అదే స్థాయిలో ఈ ప్రీక్వెల్‌లోని ‘బ్రహ్మ కలశ’ కూడా ప్రేక్షకుల హృదయాలను తాకుతోంది. ఇంకా చెప్పాలంటే పూనకాలు తెప్పిస్తుందని అంటే బాగుంటుందేమో..
‘తెలియదు శివుడా భక్తి మార్గము’
ఈ పాటలో శివుడిని భక్తితో ఆరాధించే సన్నివేశాలను అత్యంత శక్తివంతమైన విజువల్స్‌తో చిత్రీకరించారు. ‘తెలియదు శివుడా భక్తి మార్గము’ అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం కన్నుల పండుగగా, భక్తిభావం ఉట్టిపడేలా ఉంది. రిషబ్‌శెట్టి మార్క్ మేకింగ్, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘కాంతార’ చిత్రానికి సంగీతం అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ పాటకు కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో ‘వరాహరూపం’ థీమ్ మ్యూజిక్‌ను గుర్తు చేసేలా పౌరాణిక శక్తితో కూడిన స్వరాలను వినియోగించారు. తెలుగు పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, అబ్బి వి ఈ పాటను అన్ని భాషలలో ఆలపించడం విశేషం. ‘బ్రహ్మ కలశ’ కేవలం పాట మాత్రమే కాదు, ‘కాంతార: చాప్టర్ 1’ కథనంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగే సన్నివేశాలను సూచిస్తుంది. భక్తి, సంస్కృతి, పురాణం మేళవింపుగా రూపొందిన ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నాట్యం కూడా, రిషబ్ డప్పు మరో ప్రధాన హైలెట్ అని చెప్పుకోవచ్చు.
ఏడు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు
హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా అక్టోబర్ 2న (దసరా కానుకగా) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలో ఏడు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు సాధించిన నేపథ్యంలో, మేకర్స్ సినిమాలోని ఈ కీలకమైన వీడియో సాంగ్‌ను విడుదల చేసి, ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ పాట విడుదలైన కాసేపటికే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టితో పాటు రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
