Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) డే 31 కొన్ని ఆసక్తికర టాస్క్‌లు జరిగినట్లుగా, తాజాగా వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. ఒక టాస్క్‌లో హౌస్‌మేట్స్ బలానికి, ఓపికకు పరీక్షగా ఉంటే, ఇంకోటి ఆర్ట్ టాస్క్ చాలా కామెడీగా నడిచింది. మొదటి టాస్క్‌లో తనూజ, కళ్యాణ్‌ల మధ్య కాస్త సీరియస్ వెదర్ నడిస్తే, రెండో టాస్క్‌లో సుమన్ శెట్టి రూపంలో ఫుల్ కామెడీ వర్కవుటైంది. ఇక ఈ రెండు టాస్క్‌లలో కూడా ఇమ్మానుయెల్ పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. డేంజర్ జోన్ అంటూ వచ్చిన ఈ టాస్క్‌లతో హౌస్‌మేట్స్‌లో కొందరు హ్యాపీగా ఉంటే, మరికొందరు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. మొత్తంగా అయితే డే 31 ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వబోతుందనే హింట్‌ని మాత్రం ఈ రెండు ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. ముందుగా మొదటి ప్రోమో విషయానికి వస్తే..
Also Read- Balayya vs Karthi: ఆసక్తికరమైన పోరు.. నటసింహానికి పోటీగా కోలీవుడ్ హీరో!
తనూజ దెబ్బకి కళ్యాణ్ తల పట్టుకున్నాడు
‘డేంజర్ జోన్‌లో ఉన్న ఇంటి సభ్యులకు నేనిస్తున్న టాస్క్.. హోల్డ్ ఇట్ లాక్’ అంటూ బిగ్ బాస్.. ఊయల టైప్‌లో ఓ బళ్లను ఏర్పాటు చేసి, దానిని ఇద్దరు కంటెస్టెంట్స్ బలంగా పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ బల్లపై పెట్టే బరువును పడిపోకుండా బిగ్ బాస్ చెప్పే వరకు అలా పట్టుకునే ఉండాలి. ఇది టాస్. ఈ టాస్క్‌లో భరణి, దివ్య.. రీతూ, పవన్.. కళ్యాణ్, తనూజ.. సంజన, ఫ్లోరా.. శ్రీజ, సుమన్ శెట్టి జంటలుగా ఈ టాస్క్‌ను ఆడారు. క్రమక్రమంగా బిగ్ బాస్ బరువును పెంచుతూ వెళ్లారు. ఫస్ట్ సుమన్, శ్రీజ జంట అవుటాఫ్ ది గేమ్ అయ్యారని కెప్టెన్ రాము ప్రకటించారు. తర్వాత భరణి, దివ్య జంటతో పాటు ఫ్లోరా, సంజన జంట కూడా వారి బరువును వదిలేశారు. ఇక కళ్యాణ్, తనూజల విషయంలో తనూజది మిస్టేక్ ఉన్నా.. కళ్యాణ్‌పై విరుచుకుపడింది. తనూజ దెబ్బకి కళ్యాణ్ తల పట్టుకున్నాడంటే.. ఎంత సీరియస్‌గా ఆమె రియాక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రోమోలో ఉన్న మ్యాటర్.
Also Read- Peddi Update: పూణేలో జాన్వీతో రామ్ చరణ్ రొమాన్స్.. తాజా అప్డేట్ ఇదే!
హౌస్ సభ్యులందరూ పగలబడి నవ్వారు
రెండో ప్రోమో విషయానికి వస్తే.. ‘నేను మీకు ఇస్తున్న టాస్క్.. మ్యాచ్ ఇట్, విన్. దీనికి పోటీదారులు చేయాల్సిందల్లా ప్రతి జంటలోని ఒకరు యాక్టివిటీ రూమ్‌లో మ్యూజియంకు వెళ్లి, అక్కడ రెడ్ క్లాత్‌పై ఉన్న పెడెస్టల్‌పై ఉన్న వస్తువును గమనించి, లివింగ్ ఏరియాకు వచ్చి.. తాము చూసిన వస్తువును డ్రాయింగ్ బోర్డు మీద డ్రా చేయాలి’ అని బిగ్ బాస్ చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత, ‘డ్రా చేసిన వారు చెప్పండి.. మీ పార్టనర్స్ తీసుకు వచ్చిన వస్తువుల్లో ఏది సరైనది అని’ బిగ్ బాస్ అడగగానే అందరూ శ్రీజ పేరు చెప్పారు. ‘సుమంత్ మీరు గీసింది అచ్చం అలాగే ఉంది’ అని బిగ్ బాస్ అనగానే హౌస్ సభ్యులందరూ పగలబడి నవ్వారు. ఆ తర్వాత ఇమ్ము చేసిన కామెడీ హైలెట్ అనే చెప్పుకోవాలి. సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ కామెడీ చేస్తూ ఇమ్ము అందరినీ నవ్వించాడు. ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్‌తో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్ ఇవ్వడానికి అన్నీ సెట్ చేసి పెట్టాడు బిగ్ బాస్.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
