Balayya vs Karthi: నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. ఇది నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డైలాగ్. ఇప్పుడీ నటసింహాన్ని ఢీ కొట్టేందుకు కోలీవుడ్ హీరో ఎదురొస్తున్నాడు. అవును, బాలయ్య ‘అఖండ 2’ చిత్రానికి పోటీగా ఇప్పుడో కోలీవుడ్ హీరో రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). ‘అఖండ’ వంటి సంచలన విజయం తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) సినిమాకు పోటీగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా.. షూటింగ్‌తో పాటు, మ్యూజిక్ డిలేస్ పరంగా వాయిదా పడినట్లుగా టాక్ నడిచింది. ఫైనల్‌గా ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా విజయదశమిని పురస్కరించుకుని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Also Read- Peddi Update: పూణేలో జాన్వీతో రామ్ చరణ్ రొమాన్స్.. తాజా అప్డేట్ ఇదే!
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో..
ఇప్పుడదే రోజు కోలీవుడ్ హీరో కార్తి (Karthi) నటించిన ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar) సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా మోస్ట్ అవేటెడ్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కలగలిపి దర్శకుడు నలన్ కుమారస్వామి (Nalan Kumarasamy) రూపొందిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను కూడా డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువస్తున్నట్లుగా స్టూడియో గ్రీన్ సంస్థ ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర ఫైట్‌కు నాంది పలికినట్లయింది. ‘వా వాతియార్’ సినిమాలో కార్తి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.
Also Read- Mohan Babu University: కోర్టు ఉత్తర్వును ధిక్కరించారు.. కాంట్రవర్సీపై మంచు విష్ణు స్పందనిదే!
కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు
మరో వైపు బాలయ్య, బోయపాటి హిట్ కాంబోలో హ్యాట్రిక్ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘అఖండ 2: తాండవం’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. మధ్యలో థమన్ ఇస్తున్న ఎలివేషన్స్‌తో ఫ్యాన్స్ భూమి మీద కూడా ఆగడం లేదు. కచ్చితంగా బాక్సులు బద్దలవుతాయని.. నందమూరి అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సోలో రిలీజ్ లభించిందని అంతా అనుకున్నారు. ఇప్పుడు కార్తి సినిమా యాడ్ అవడంతో.. ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, కార్తికి తెలుగులో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఈ మధ్యలో కాలంలో సరైన హిట్ లేదు కానీ, ‘ఖైదీ’ తరహాలో సినిమా పడితే మాత్రం.. ‘అఖండ 2’ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. చూద్దాం.. డిసెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
