Kannappa Special Show
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ‘కన్నప్ప’ స్పెషల్ షో..

Kannappa: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మంచు ఫ్యామిలీకి వచ్చిన హిట్ కావడంతో, ఆ ఫ్యామిలీ అభిమానులంతా ఈ సినిమాతో హ్యాపీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత మంచు హీరోల సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం విజయవాడలో గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ‘కన్నప్ప’ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ స్పెషల్ షోకు నాగ సాధువులు, అఘోరాలు‌లతో కలిసి మంచు మోహన్ బాబు హాజరయ్యారు. సినిమా చూసిన వారంతా ఈ సినిమాపై, టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

Also Read- Viral Video: రీల్స్ పిచ్చితో కూతురు ప్రాణాలు పణంగా పెట్టిన తండ్రి.. జస్ట్ మిస్!

ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు (M Mohan Babu) మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమాను చాలా గొప్పగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందనను రాబట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. మంగళవారం, ఇలా విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఎంతో ఆనందంగా ఉంది. వారంతా సినిమా చాలా బాగా తీశారని అంటుంటే, ఇంతకంటే ఏం కావాలని అనిపిస్తోంది.. ప్రేక్షకులందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి మరింత సక్సెస్ చేయాలని కోరారు.

Also Read- GHMC Regulations: పర్మిషన్స్ ఉన్నా ‘ఎన్ఓసీ’ తీసుకురావాల్సిందే.. జీహెచ్‌ఎంసీ కొత్త నిబంధనతో వణికిపోతున్న బిల్డర్లు

గజల్ శ్రీనివాస్ (Gazal Srinivas) మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన, ఈ నిర్ణయం తీసుకుని ఎంతగానో కృషి చేసిన వారందరికీ అభినందనలు. ‘కన్నప్ప’ సినిమా అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. ‘కన్నప్ప’ జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్ బాబుకు ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా చిత్రీకరించారు. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన యూనిట్‌కు అభినందనలు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, విష్ణు ఇలా అందరూ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ షోకు నాగ సాధువులు, సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది వచ్చారు. వారంతా టీమ్‌ని అభినందిస్తుంటే నాకు కూడా ఆనందంగా అనిపించింది. ఇలాంటి చిత్రాలను అందరూ చూడాలి. పిల్లలకు కూడా చూపించి, అన్ని తెలిసేలా చెప్పాలని అన్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల‌పై ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం