Kannappa OTT Update
ఎంటర్‌టైన్మెంట్

Kannappa OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కన్నప్ప’.. ఆ రూల్‌కి బ్రేక్!

Kannappa OTT: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది కానీ, ఆ టాక్‌కు సరిపడా కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ మినహా ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది లేదు. మొత్తంగా రూ. 200 కోట్ల బడ్జెట్ అయినట్లుగా సినిమా విడుదలకు ముందు మేకర్స్ ప్రకటించారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా థియేట్రికల్‌గా కేవలం రూ. 25 కోట్లను మాత్రమే రాబట్టినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి ఈ సినిమా మరో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర నటీనటులు నటించినా, ఈ సినిమాను బడ్జెట్ పరంగా గట్టెక్కించలేకపోయారు. దీంతో సినిమా భారీ పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాన్ థియేట్రికల్ రూపంలో మాత్రం ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

సుమారు రూ. 60 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లుగా ఆ మధ్య టాక్ నడిచింది. ఇక ఈ సినిమా థియేటర్లలో కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో.. ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాను చెప్పిన దానికంటే ముందే స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రమోషన్స్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ.. రూల్ ప్రకారమే ఈ సినిమా విడుదలైన 8 నుంచి 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని ప్రకటించారు. అప్పుడాయనకి ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది. అన్ని రోజులు థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్‌గా నడుస్తుందని విష్ణు భావించారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఫైనల్‌గా ఈ సినిమా కూడా ఈ మధ్య ఓటీటీలలోకి వస్తున్న నాలుగు వారాల సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Usurae: హీరో, హీరోయిన్‌‌లని కొట్టా.. సీనియర్ హీరోయిన్ రాశి షాకింగ్ కామెంట్స్

ఆ సెంటిమెంట్ ప్రకారం ‘కన్నప్ప’ చిత్రం జూలై 25 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. అయితే మేకర్స్ మాత్రం దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ లేకపోయినప్పటికీ, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని, తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. మంచు విష్ణు కూడా 8 వారాల రూల్‌ని బ్రేక్ చేసి, నాలుగు వారాలకే ‘కన్నప్ప’ను థియేటర్లలోకి తెచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సినిమా కలెక్షన్లు బాగుండి, థియేటర్లలో రన్ అవుతుంటే, మొదట చెప్పినట్లుగానే ఈ సినిమా 8 నెలల తర్వాతే వచ్చేది. కానీ పరిస్థితి ఊహించినట్లుగా లేకపోవడంతో.. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే.. ఓటీటీలోకి ‘కన్నప్ప’ను తీసుకొస్తున్నారనేది తాజా సమాచారం.

Also Read- Ambati Rambabu: వీరమల్లుపై అంబటి ట్వీట్.. ఏం తాతా ప్రీమియర్ టికెట్స్ దొరకలేదా? అంటూ కామెంట్స్!

‘కన్నప్ప’ కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) తన కుమారుడు తిన్నడు (మంచు విష్ణు)ను అన్నీ తానై పెంచుతాడు. విలు విద్యలో ఆరితేరిన తిన్నడు.. తన చిన్నప్పుడు జరిగిన ఓ ఘటనతో దేవుడిపై నమ్మకం కోల్పోయి, నాస్తికుడిగా మారతాడు. దేవుడు లేడని నమ్మే తిన్నడు.. తన తండ్రి మాటను మాత్రం జవదాటడు. తన గూడెంతో పాటు ఆ అడవిలో చుట్టుపక్కల ఉన్న గూడెంలలోని వారికి ఎటువంటి ఆపద వచ్చినా, వారి కోసం నిలబడి పోరాడుతుంటాడు. అలాంటి తిన్నడు ఓ మూఢ నమ్మకానికి ఎదురెళ్లి.. గూడెం నుంచి బహిష్కరించబడతాడు. అప్పటికే నెమలి (ప్రీతి ముకుందన్) ప్రేమలో ఉన్న తిన్నడు.. ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇద్దరూ గూడెం వదిలి వెళ్లిపోతారు. అలా వెళ్లిన తిన్నడు, దేవుడు లేడని అసహ్యించుకునే వాడు.. ఒక్కసారిగా గొప్ప శివ భక్తుడిగా మారిపోతాడు. తిన్నడులో ఆ మార్పు ఎలా వచ్చింది? అందుకు కారణమైన ‘రుద్ర’ (ప్రభాస్) ఎవరు? దేవుడు లేడన్నవాడు.. ఆ దేవుడి కోసం ఏం త్యాగం చేశాడు? తిన్నడు నుంచి కన్నప్పగా అతని పేరు ఎలా, ఎందుకు మారింది? మధ్యలో వచ్చే వాయిలింగం కథేంటి? ఈ కథకి, శ్రీకాళహస్తికి ఉన్న లింకేంటి? వంటి ప్రశ్నలకు సమాధానామే ఈ ‘కన్నప్ప’ సినిమా.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!

Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!

Telangana Politics: కాంగ్రెస్ స్కెచ్‌కి ఇరుక్కుపోయిన బీఆర్ఎస్.. ఎలా అంటే..?

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్