Usurae: సీనియర్ హీరోయిన్ రాశి ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉసురే’. యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆగస్టు 1న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నవీన్ డి. గోపాల్ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్.
ఈ కార్యక్రమంలో నటి రాశి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర ఎలా ఉంటుందో ఆల్రెడీ ట్రైలర్‌లో చూశారు. ఈ చిత్రంలో నేను హీరోని కొట్టాను, అలాగే హీరోయిన్‌ని కూడా కొట్టాను. ‘ప్రేయసిరావే’ సినిమాలో హీరో శ్రీకాంత్‌ని కొట్టాను.. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. నాకున్న ఆ సెంటిమెంట్ ప్రకారం ‘ఉసిరే’ కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరిని కొడితే.. వాళ్ల సినిమా పెద్ద హిట్. యదార్థ సంఘటనలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దర్శకుడు గోపాల్ మంచి విజన్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశారు. కంటెంట్ చాలా బాగుంటుంది. నిర్మాత సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నా కూతురుగా నటించిన జననికి హీరోయిన్‌గా మంచి భవిష్యత్ ఉంటుంది. హీరో కూడా ఇందులో ఎంతో నేచురల్‌గా కనిపిస్తాడు. సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుంది. అది ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో నా పాత్ర చూసి అంతా ఆశ్చర్యపోతారు. అందరూ ప్రాణం పెట్టి, ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. నాకు కూడా ఈ సినిమాతో మంచి విజయం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
Also Read- Ambati Rambabu: వీరమల్లుపై అంబటి ట్వీట్.. ఏం తాతా ప్రీమియర్ టికెట్స్ దొరకలేదా? అంటూ కామెంట్స్!
దర్శకుడు నవీన్ డి. గోపాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నిర్మాత ఇచ్చిన సహకారం మరువలేనిది. ఆయనపై నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇటీవల చెన్నయ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను లెజెండరీ నటుడు కమల్‌హాసన్‌కు చూపించాను. ఆయనకు ట్రైలర్ బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అభినందించారు. నిజంగా అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాట రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాకు కావాల్సిన నటీనటులు కుదిరారు. ఈ సినిమాను చిత్తూరులోని ఓ గ్రామంలో ఎక్కువగా చిత్రీకరించాం. అందరికీ ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఎంతో సహజంగా చిత్రీకరణ జరిపామని తెలుపగా.. నిర్మాత మౌళి ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు నాకు కజిన్. పన్నెండేళ్ల క్రితం ఓ షార్ట్ ఫిలిం చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఈ సినిమా చేశాం. ఇందులో సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని చర్చించాం. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే మంచి లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ మదర్ పాత్రను రాశి పోషించారు. ఈ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్, విజయ్ సేతుపతి, శృతి హాసన్ వంటి వారెందరో సపోర్ట్ చేశారు. కొత్త టీమ్‌తో వస్తున్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు