Kannada Actress: మగవారిని కుక్కలతో పోలుస్తూ కన్నడ నటి దివ్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అసలు మగవారికి కుక్కలతో పోల్చడం ఏంటని నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు అన్నారంటే.. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కుక్కలు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాయో తెలియదంటూ సుప్రీం కోర్టు అన్న్ వ్యాఖ్యలను ఆమె ఇలా వక్ర అర్థం వచ్చే విధంగా తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అసలు ఆమె ఏం అన్నారంటే.. కుక్కలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఆమె ప్రస్తావిస్తూ.. ‘మగాళ్ల మైండ్ సెట్ కూడా చదవలేం, వారు కూడా ఎప్పుడు రేప్ చేస్తారో, మర్డర్ చేస్తారో తెలియదు.. మరి వారిని కూడా జైల్లో పెట్టాలా?’ అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Read also-Celebrity Controversy: మరోసారి వైరల్ అవుతున్న అనసూయ వీడియో.. శివాజీని ఏం అన్నారంటే?
దక్షిణాదికి చెందిన ప్రముఖ నటిమణుల్లో రమ్య (అసలు పేరు దివ్య స్పందన) ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన ఆమె.. సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్, అభిమన్యు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. అటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎంపీగాను సేవలు అందించారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. మరో సారి మగవారిని కుక్కలతో పోల్చి వార్తల్లో నిలిచారు. ప్రజా ప్రతినిధిగా చేసి ఆమె ఇలా అనడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాధత గల వ్యాక్తులో ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే సామన్య ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్ల ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకూ దారి తీస్తుందో చూడాలి మరి.
Read also-Prabhas Interview: సందీప్ రెడ్డితో ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూ.. ఫుల్ వీడియో వచ్చేసింది..
ఇంతకు ముందు కూడా..
గతంలో కూడా సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పులను ఆమె తప్పుపడుతూ వార్తల్లో నిలిచారు. ‘నటుడు దర్శన్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం పట్ల తాము సంతోషంగా లేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన వార్తాపత్రిక నివేదికను ట్వీట్‌తో ప్రచురించాను. సుప్రీంకోర్టు భారతదేశంలోని సామాన్య ప్రజలకు ఆశాకిరణం. రేణుకస్వామికి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని పెట్టాను అంతే’ అని దివ్య స్పందన అన్నారు. ఆ తర్వాత తనపై సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దర్శన్ మద్దతుదారులు నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేయాల్సిందని అన్నారు. నాకు అత్యాచార బెదిరింపులు, అసభ్యకరమైన సందేశాలు పంపారు. సమాజం ఎంతగా దిగజారిపోయిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావించి ఫిర్యాదు చేశాను’ అంటూ దివ్య స్పందన చెప్పుకొచ్చారు.

