Thug Life Trouble: 'థగ్ లైఫ్'పై నిషేధం.. హైకోర్ట్ మెట్లెక్కిన కమల్
Thug Life Trouble (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Thug Life Trouble: ‘థగ్ లైఫ్’పై నిషేధం.. హైకోర్ట్ మెట్లెక్కిన కమల్.. ఊరట లభించేనా!

Thug Life Trouble: కన్నడ భాష పై లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటక (Karnataka)లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ పై అధికార, విపక్ష పార్టీలతో పాటు కన్నడ భాషా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అంతేకాదు కమల్ లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ (Thug Life) జూన్ 5న విడుదల కావాల్సి ఉండగా.. కర్ణాటకలో దానిని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల రోజున ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ ఏర్పడింది. ఈ క్రమంలోనే కమల్ హాసన్ కీలక ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

హైకోర్టులో పిటిషన్
థగ్ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన సంగతి తెలిసిందే. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ (Raaj Kamal Films International) ద్వారా సినిమాను రూపొందించారు. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మూవీ విడుదలను అడ్డుకుంటామని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ప్రకటించింది. దీంతో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన ప్రొడక్షన్ హౌస్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం.

పిటిషన్ లో ఏం కోరారంటే!
తన తాజా చిత్రం థగ్ లైఫ్.. విడుదలకు కర్ణాటకలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పిటిషన్ లో కోరారు. సినిమా విడుదలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ సినిమా స్క్రీనింగ్‌కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్‌ కమిషనర్‌కు సూచనలు జారీ చేయాలని తన నిర్మాణ సంస్థ ద్వారా కమల్ హాసన్ కోరారు. అయితే దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి.. తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.

Also Read: RBI Gold Loan Rules: గోల్డ్ లోన్స్‌పై ఆర్బీఐ వర్సెస్ కేంద్రం.. అసలేంటీ గొడవ.. తప్పెవరిదీ!

అసలు వివాదం ఏంటంటే!
ఇటీవల జరిగిన ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కమల్ హాసన్.. కన్నడ భాష గురించి మాట్లాడారు. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ అతడు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై అధికార, విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) కూడా తీవ్రంగా స్పందించాయి. మే 30లోగా క్షమాపణ చెప్పకపోతే.. ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించాయి. అయితే తాను మాట్లాడిన దాంట్లో తప్పులేదని.. కన్నడ భాషపై ఉన్న ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పారు. క్షమాపణ డిమాండ్లను తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా న్యాయపరమైన జోక్యాన్ని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read This: Raja Singh Threat: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాణాలకు ముప్పు.. వరుసగా బెదిరింపు కాల్స్!

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..