Kamakshi Bhaskarla (image source: X)
ఎంటర్‌టైన్మెంట్

Kamakshi Bhaskarla: కామాక్షి.. సైలెంట్‌గా చేసేస్తోంది

Kamakshi Bhaskarla: ఏ నటుడు, నటికైనా లక్ష్యం ఏముంటుంది.. ముందు ఆర్టిస్ట్‌గా తమని తాము నిరూపించుకోవాలి. ఆ తర్వాత స్టార్ డమ్ అదంతట అదే వస్తుంది. కాస్త గ్లామర్ తారలకు, బ్యాగ్రౌండ్ బలంగా ఉన్న వాళ్లకి ఈ స్టేటస్ వచ్చినా, దానిని నిలుపుకోవడానికి కచ్చితంగా కష్టపడాల్సిందే. నటనలో తమ మార్క్ ప్రదర్శించాల్సిందే. ఇప్పుడదే చేస్తుంది యంగ్ సెన్సేషనల్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వచ్చిన చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఇప్పుడు టాలీవుడ్ అగ్ర పీఠం వైపుగా కామాక్షి పయనిస్తుందంటే.. ఎంత సైలెంట్‌గా ఈ బ్యూటీ తన టాలెంట్‌ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- David Warner: అయ్యబాబోయ్ అంత సమర్పించారా? ఇలా అయితే ఇండియా వదిలిపోవడం కష్టమే!

ఈ జర్నీలో కామాక్షి భాస్కర్లకు బాగా పేరు తెచ్చిన, గుర్తింపు తెచ్చిన సినిమా అంటే కచ్చితంగా ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలే అని చెప్పుకోవచ్చు. అందులో నేచురల్ నటనతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు ఆమెను పలకరిస్తూనే ఉన్నాయి. అలా అనీ అవకాశాలు వస్తున్నాయి కదా అని కామాక్షి కూడా ఏదిపడితే అది ఒప్పేసుకోకుండా, తన పాత్రకు మంచి ఇంపార్టెన్స్, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎన్నుకుంటుండటం.. ఆమె సైలెంట్ గ్రోత్‌కి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమె మూడు సినిమాలలో లీడ్ రోల్ చేస్తున్నారు. అందులో ఒకటి ‘12A రైల్వే కాలనీ’ కాగా, రెండోవది నవీన్ చంద్ర హీరోగా చేస్తున్న చిత్రం. ఇక మూడో సినిమా పొలిమేర ఫ్రాంచైజ్ మూడో పార్ట్. ఇలా డిఫరెంట్ ప్రాజెక్టులతో కామాక్షి బిజీ నటిగా మారిపోయింది.

ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు చిత్రాలలోనూ నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా ఫిల్మోగ్రఫీకి ఎంతో కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైమ్‌లో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ.. సినిమా పట్ల ప్యాషన్‌, ప్రేమ ఉండటంతో.. ఎంత కష్టమైనా నాకు ఇష్టంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు సినిమా సెట్లలో ఉండటమే ఇష్టంగా ఉందని చెప్పుకొచ్చింది. నిజంగా ఒక ఆర్టిస్ట్‌కి కావాల్సింది ఇదే. సెట్‌లో ఉండటమే ఆర్టిస్ట్ పనితీరును తెలియజేస్తుంది.

Also Read- Allu Arjun: ఏంది సామి.. ఇంకా దానిపై మోజు తీరలేదా?

ఇక డిఫరెంట్ పాత్రలలో నటించడంపై కామాక్షి స్పందిస్తూ.. సినిమాలోని పాత్రకు ఆర్టిస్ట్ ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. అలా పాత్రకోసం నిజాయితీగా ఉండటం వల్ల యాక్టర్‌ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. అలాగే సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ చూసుకోకుండా, దాని నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎక్కువగా ఎంచుకుంటూ వస్తున్నాను. కథతో పాటు డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తూ వస్తున్నాను. నన్ను నమ్మి, నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే, నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే కాబట్టి. అలాగే, ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నేను నమ్ముతాను. అలాగే వర్క్ చేసుకుంటూ వస్తున్నానని చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!