Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు అదృష్టం, మరోవైపు దురదృష్టం అన్నట్లుగా అల్లు అర్జున్ లైఫ్‌లో రీసెంట్‌గా కొన్ని రోజులు గడిచాయి. అదృష్టం ‘పుష్ప 2’ సక్సెస్ రూపంలో వస్తే, దురదృష్టం ఆ సినిమా చూడడానికి వెళ్లి ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు కోమాలో ఉండటం.. తద్వారా ఒక రోజు జైలులో ఉండాల్సి రావడం వంటి వాటితో అల్లు అర్జున్ పేరు మారుమోగింది. సక్సెస్‌ని కూడా ఎంజాయ్ చేయలేకపోయిన హీరో ఎవరైనా ఉన్నారూ అంటే, అది కచ్చితంగా అల్లు అర్జున్ అనే చెప్పుకోవచ్చు. ‘పుష్ప 2’ మూవీ ఆయన కెరీర్‌లో అలాంటి రోజులను మిగిల్చింది.
Also Read- Hrithik Roshan: ఇండియన్ సూపర్ హీరో మళ్లీ వచ్చేస్తున్నాడు.. ‘క్రిష్ 4’పై మైండ్ బ్లోయింగ్ అప్ డేట్!
‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌ని ఎంతగా భయపెట్టిందంటే.. ఆ తర్వాత ఆయన పబ్లిక్ ప్లేస్‌లోకి రావడానికే భయపడిపోయేంతగా. ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత మరో సినిమా చేయడానికి ఆలోచనలో పడేంతగా. అవును, ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మరింత ఆలస్యమవుతుందని ఆ చిత్ర వర్గాల ద్వారా న్యూస్ సంచరిస్తూనే ఉంది. మరోవైపు అసలు ఆ సినిమా ఆగిపోయిందనేలా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్‌లో అట్లీ వార్తలలోకి వచ్చేశాడు. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా అట్లీతో కన్ఫర్మ్ అయిందని, అతి త్వరలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుందనేలా టాక్ వినబడుతుంది.
వాస్తవానికి అట్లీ సినిమా విషయంలో కూడా రకరకాలుగా వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అట్లీ భారీగా రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని, అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా ఒక అంకె చెప్పి కూర్చున్నాడని, దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా డౌటే అన్నట్లుగా వార్తలు నడిచాయి. కానీ, అట్లీతో అల్లు అర్జున్ సినిమా కరారు కావడమే కాకుండా.. ఆ సినిమా కాన్సెప్ట్‌పై కూడా సోషల్ మాధ్యమాలలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. అట్లీతో బన్నీ చేయబోయే సినిమా పునర్జన్మల కాన్సెప్ట్‌తో భారీ పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. నిజంగా అదే కనుక నిజమైతే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘మగధీర’ టార్గెట్‌గా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే..
Also Read- OTT Movies: ఈ వీకెండ్ చాలా స్పెషల్.. ఓటీటీలోకి 4 క్రేజీ చిత్రాలు!
‘మగధీర’ (Magadheera) సినిమా తర్వాత అల్లు అర్జున్ అటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ సినిమాను నిర్మించిన తన తండ్రితో నాతోనూ అలాంటి సినిమా తీయాల్సిందేనని పట్టుబడితే.. పాపం అరవింద్.. ‘బద్రీనాధ్’ (Badrinath) అంటూ తీసి చేతులు కాల్చుకున్నారు కూడా. అప్పటి నుంచి ‘మగధీర’లాంటి సినిమా కోసం అల్లు అర్జున్ చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడు అట్లీ వచ్చి పునర్జన్మల కాన్సెప్ట్ చెప్పగానే.. అల్లు అర్జున్ ఓకే చేశాడంటే.. ‘మగధీర’ ఇంపాక్ట్ ఆయనపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో బన్నీ రెండు రకాల గెటప్స్‌తో కనిపిస్తారని తెలుస్తుంది. జూలై లేదంటే , ఆగస్ట్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉందనేలా చిత్రవర్గాల ద్వారా తెలుస్తుంది. త్వరలోనే అన్ని విషయాలు తెలియనున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు