David Warner (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

David Warner: అయ్యబాబోయ్ అంత సమర్పించారా? ఇలా అయితే ఇండియా వదిలిపోవడం కష్టమే!

David Warner: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. గ్రౌండ్‌లో బ్యాటింగ్ ఎలా చేయగలడో.. గ్రౌండ్ బయట వీడియోలతో అలా మెప్పించగలడు. అప్పట్లో ఇండియన్ సినిమా హీరోలను అనుకరిస్తూ, ఆయన చేసిన వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ముఖ్యంగా దక్షిణాది హీరోల సినిమాలలోని పాటలకు ఆయన, ఆయన ఫ్యామిలీ వేసిన స్టెప్స్, క్రికెట్ ప్రపంచానికే కాదు, గ్లామర్ ప్రపంచానికి కూడా ఆయనని పరిచయం చేశాయి. ఇక ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ మామ.. ఇప్పుడు ఏకంగా నట అరంగేట్రం చేసేశారు. క్రికెట్ తర్వాత ఏంటి అంటే కొందరు పాలిటిక్స్ అంటారు. కానీ తనకి క్రికెట్ కాకుండా, ఫేమస్ చేసిన నటనతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

Also Read- Hrithik Roshan: ఇండియన్ సూపర్ హీరో మళ్లీ వచ్చేస్తున్నాడు.. ‘క్రిష్ 4’పై మైండ్ బ్లోయింగ్ అప్ డేట్!

ఈ క్రమంలో ఆయన ఆల్రెడీ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో కలిసి ఓ అడ్వర్‌టైజ్‌మెంట్‌ కూడా చేశాడు. ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్‌పై తన తడాఖా చూపేందుకు ‘రాబిన్‌హుడ్’ (Robinhood) రూపంలో రైట్ రైట్ అంటూ వచ్చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin), డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు డేవిడ్ భాయ్ ఓకే చెప్పడమే కాదు.. కళ్లు చెదిరిపోయేలా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తెలిస్తే.. ఏ స్టార్ హీరో ఆయనకు సరిపోడని చెప్పుకోవాలి. అలాగే, ఇండియాలో ఇలాగే రెమ్యూనరేషన్ ఇస్తారని భావిస్తే.. తన పౌరసత్వాన్ని ఇండియాకు మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనే లేదు.

నిజంగా, ‘రాబిన్‌హుడ్’ సినిమాలో డేవిడ్ భాయ్ పాత్ర మెప్పించినా, ఆ పాత్ర కారణంగా సినిమాకు కాస్తో కూస్తో ప్లస్ అనే టాక్ వచ్చినా.. డేవిడ్ భాయ్‌ని ఇక పట్టుకోలేరు. ప్రస్తుతానికైతే ఈ సినిమాలోని పాత్రకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిసిన వారంతా.. ‘బాహుబలి’ సినిమాలోని ‘వీడెక్కడున్నా రాజేరా?’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అసలింతకీ డేవిడ్ బాయ్ ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? ఎన్ని రోజులు షూట్ చేశారు? వంటి వివరాలలోకి వెళితే..

Also Read- Allu Arjun: ఏంది సామి.. ఇంకా దానిపై మోజు తీరలేదా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ ఆస్ట్రేలియన్ వీరబాదుడు క్రికెటర్ ‘రాబిన్‌హుడ్’ కోసం కేవలం 2 రోజులు మాత్రమే సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన రెండు రోజుల షూట్‌ని ఆస్ట్రేలియాలోనే షూట్ చేశారట. రెండు నిమిషాలు కూడా కనబడని ఈ పాత్ర కోసం డేవిడ్ వార్నర్‌కు అక్షరాలా మైత్రీ వారు సమర్పించిన పారితోషికం రూ. 2.5 కోట్లు. షాకయ్యారా! అవును ఇది నిజం, రెండు రోజుల షూటింగ్‌కు, ఒక రోజు ప్రమోషన్స్‌కు వచ్చేలా డేవిడ్ వార్నర్‌తో ఈ అమౌంట్‌కు ఒప్పందం చేసుకున్నారట. అంటే ఒక్కో రోజుకు వార్నర్‌కు రూ. 1.25 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారన్నమాట. ఈ పారితోషికంతో.. డేవిడ్ మామ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే.. అత్యంత ఖరీదైన అతిథి పాత్రలు పోషించిన నటుల జాబితాలో చోటు సంపాదించాడు. అందుకే అంది.. గ్రౌండ్ అయినా, స్క్రీన్ అయినా వార్నర్ మామ దంచుడు అలానే ఉంటుంది మరి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!