Kajal Aggarwal: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత వరకు ఈ హీరో ఎలాంటి వివాదాల్లోకి వెళ్ళింది లేదు. అయితే, సినిమా షూట్ లో సీనియర్ హీరోయిన్ తో గొడవ పెట్టుకున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి, ఆ హీరోయిన్ ఎవరు? మహేష్ బాబు ఆమెతో ఎందుకు గొడవ పడ్డాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Jr NTR Movies: అక్కడ హ్యాట్రిక్ సాధించిన మొదటి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్
ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు? సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఏంటి షాక్ అవుతున్నారా? ఇది నిజమే అండి. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలలో ఇద్దరూ కలిసి నటించారు. వీరిద్దరి మధ్య సూపర్ కెమిస్ట్రీ ఉన్నప్పటికీ, వీరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయో అని సందేహిస్తున్నారా? అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు
అయితే, గతంలో సుకుమార్ డైరెక్షన్ వహించిన వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా బాలీవుడ్ భామ కృతి సనన్ ని తీసుకోక ముందే కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారట.అంతే కాదు, వీరిద్దరికి సంబంధించిన సీన్స్ రెండు మూడు వారాల షూటింగ్ కూడా జరిగిందట. కానీ ఏమైందో తెలీదు కానీ, కాజల్ అగర్వాల్ షూట్ నుంచి తప్పుకుందట. కానీ, తెలిసిన సమాచారం ప్రకారం, కాజల్ అగర్వాల్, మహేష్ బాబు మధ్య ‘వన్ నేనొక్కడినే’ సినిమా షూటింగ్‌లో గొడవ జరిగిందని, అందుకే కాజల్ ఆ సినిమాని వదిలేసిందని రూమర్స్ వచ్చాయి. ఇంకొందరు దీనిలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేస్తున్నారు. షూటింగ్ సమయంలో అసలు ఎలాంటి గొడవా జరగలేదు. నిజం ఏంటంటే, కాజల్ ఆ సమయంలో ఏకంగా 15 సినిమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాల సినిమాల డేట్స్‌ని సర్దుబాటు చేయలేక, చివరికి ‘వన్ నేనొక్కడినే’ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.
Also Read: Jr NTR Movies: అక్కడ హ్యాట్రిక్ సాధించిన మొదటి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్
