Jr NTR Movies: టాలీవుడ్ యాక్షన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నార్త్ అమెరికాలో చరిత్ర సృష్టించాడు. తన మూడు చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’, ‘వార్ 2’ చిత్రాలు ఒక్కొక్కటి 4 మిలియన్ డాలర్లు (సుమారు 33.6 కోట్ల రూపాయలు) వసూలు చేసి హ్యాట్-ట్రిక్ సాధించాయి. ఈ ఘనత సాధించిన మొదటి టాలీవుడ్ స్టార్‌గా ఎన్టీఆర్ నిలిచారు. ఈ విజయం అతని నటనా ప్రతిభ, చిత్రాల ఆకర్షణ, ప్రేక్షకుల మద్దతును చూపిస్తుంది. 2001 లో ‘స్టూడెంట్ నంబర్ 1’తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రల్లో నటించి తెలుగులో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 2022లో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ నార్త్ అమెరికాలో 115 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. 2024లో విడుదలైన ‘దేవర’, 2025లో విడుదలైన ‘వార్ 2’ సినిమాలు కూడా నార్త్ అమెరికాలో 33.6 కోట్ల రూపాయల మైలురాయిని దాటాయి. ఈ ఘనత సాధించిన మొదటి హీరో గా ఎన్టీఆర్ నిలిచారు.
Read also-Cyber Criminals: ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పట్టుబడ్డ 13 మంది సైబర్ నేరగాళ్లు
2022 రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ రామ చరణ్, ఎన్టీఆర్ లను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. బ్రిటిష్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1,260 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ (2024), 4.5 మిలియన్ డాలర్లు (37.8 కోట్ల రూపాయలు) సాధించింది. ‘వార్ 2’ యాష్ రాజ్ ఫిల్మ్స్ బేనర్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా నార్త్ అమెరికాలో 35 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇలా ఒక టాలీవుడ్ హీరో వరుసగా నార్త్ అమెరికాలో హాట్రిక్ విజయాలు సాథించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Viral News: ఓర్నాయనో.. ఆటోలో 1 కి.మీ ప్రయాణానికి.. రూ.425 వసూల్!
ఇప్పటికే ‘వార్ 2’ సినిమా తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా వార్ 2 రికార్డు సాధించింది. రణబీర్ కపూర్ ‘యానిమల్’ను ఈ సినిమా అధిగమించింది. హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా రికార్డును ఈ సినిమా అధిగమించింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సంచలన విజయం సాధించడం ద్వారా బాలీవుడ్ సినిమాలు దక్షిణ భారతదేశంలో కూడా బలమైన ఆదరణ పొందుతున్నాయని నిరూపించింది. ‘వార్ 2’ సినిమా యాక్షన్ జానర్‌లో ఒక భారీ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా 2019లో విడుదలైన ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. హృతిక్ రోషన్‌తో పాటు, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించారు.