JVAS
ఎంటర్‌టైన్మెంట్

JVAS: మెగాస్టార్ ఐకానిక్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే?

JVAS: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), శ్రీదేవి (Sridevi) కాంబినేషన్‌లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐకానిక్ ఫిల్మ్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్ర రీ రిలీజ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, రీ రిలీజ్‌లో ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి.

చిరంజీవి కెరీర్‌లోనే ఓ సంచలనాత్మక చిత్రంగా నిలిచిన ఈ సినిమా.. అప్పట్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ అత్యద్భుతం అనేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజంగా ఇప్పుడేదో యూనివర్స్ అది, ఇదని అంటున్నారు కానీ, అప్పట్లోనే ఈ చిత్రంతో రాఘవేంద్రుడు దానికి శ్రీకారం చుట్టారు. రాజు పాత్రలో చిరంజీవి ఆద్యంతం తనదైన మార్క్ కనబరిస్తే, ఇక నిజంగానే దేవకన్యలు ఇలానే ఉంటారా? అనేలా శ్రీదేవి రక్తికట్టించింది. ఆమె నటన, ఆహార్యం అన్నీ కూడా నిజమైన దేవకన్యను తలపించాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇక విలన్‌గా చేసిన అమ్రిష్ పురి.. ఈ సినిమాకు మరో హైలెట్. విలనిజంలో సరికొత్తగా అధ్యాయం మొదలైంది కూడా ఇక్కడే అని చెప్పుకోవచ్చు.

Also Read- King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!

ఇందులో చిన్నారులుగా చేసిన పిల్లలలో కొందరు ఈ రోజు స్టార్లు అయ్యారు. కథ, కథనం, నిర్మాణ విలువలు అన్నీ కూడా, ఇప్పుడున్న రేటింగ్‌ల ప్రకారం చెప్పాలంటే, 5కి 5 మార్కులు పడే సినిమా ఇది. సినిమాలోని పాటలు, ఫైట్స్ వేటికవే సాటి అనేలా దర్శకేంద్రుడు ఈ సినిమాకు ప్రాణం పోశారు. మెగాస్టార్ చిరంజీవి మార్క్‌తో ప్రపంచాన్ని జయించగల శక్తి ఉన్న వీరోచిత పాత్ర కావడంతోనే ఆయన జగదేక వీరుడు అయ్యాడు. దేవకన్య అనే అర్థానికి నిర్వచనంగా ఉంటుంది కాబట్టే శ్రీదేవి.. అతిలోకసుందరి అయ్యింది. ఇప్పుడు, ఎప్పుడు వచ్చినా ఈ సినిమాకు తిరుగులేదు. అలాంటి కంటెంట్ ఇందులో ఉంది.

">

ఇక రీ రిలీజ్‌కు మేకర్స్ ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఏమిటంటే, అప్పట్లో ఈ సినిమా ఏ తేదీన విడుదలయ్యిందో.. అదే తేదీన రీ రిలీజ్‌ కాబోతోంది. అప్పట్లో ఈ సినిమా సక్సెస్ తర్వాత మే 9 అనేది ఐకానిక్ డేట్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాను 2డి, 3డిలలో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటి జనరేషన్ కోసం, వారు అలవాటు పడిన టెక్నాలజీతోనే ఈ సినిమాను రీ రిలీజ్‌కు తెస్తున్నారు. అప్పట్లో సునామీని సృష్టించిన ఈ సినిమా.. రీ రిలీజ్‌లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Sunitha on Pravasthi: ప్రవస్తి పాడే ముందే సింగర్ సునీత ఇంత గేమ్ ప్లాన్ చేసిందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఈ సినిమా రీ రిలీజ్ ప్రకటనను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్‌ ద్వారా తెలియజేశారు. రీ రిలీజ్ డేట్‌తో వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. వాస్తవానికి మే 9వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమా వాయిదా పడటంతో ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ రూపంలో మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ మాత్రం మిస్ కాలేదనే చెప్పుకోవాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు