Junior Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Junior Movie: ‘జూనియర్’ ప్రీ రిలీజ్ వేడుకలో హైలైట్ ఏంటో తెలుసా?

Junior Movie: రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’ (Junior). రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకప్పటి స్టార్ నటి జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదలైన ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ట్రెండ్‌ బద్దలు కొడుతోంది. ఒక పరిచయ హీరో పాట ఇంతలా ట్రెండ్ అవడానికి కారణం కచ్చితంగా శ్రీలీలే అని చెప్పుకోవచ్చు. ఇక జూలై 18న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకగా ఎంత గ్రాండ్‌గా జరిగినా, ఎంత మంది అతిథులు ఈ వేడుకకు హాజరైనా, హైలైట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్కటి. అదేంటంటే..

Also Read- Genelia: నా భ‌ర్త అలాంటి వాడే.. నన్ను చాలా టార్చ‌ర్ చేశాడు.. జెనీలియా సంచలన కామెంట్స్

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకపై ఓ బామ్మ వేసిన స్టెప్స్. అవును.. ట్రెండింగ్‌లో ఉన్న ‘వైరల్ వయ్యారి’ సాంగ్‌కు ఓ బామ్మ వేసిన స్టెప్స్ చూసిన వారంతా.. ‘బామ్మ సార్ బామ్మ అంతే’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంకా చెప్పాలంటే.. ఆ స్టెప్స్ చూసి ఆశ్చర్యపోవడం యాంకర్ సుమ వంతైంది. ఆ బామ్మ ఎవరో కాదు.. ఈ మధ్య వస్తున్న సినిమాలో ఎక్కువగా కనిపిస్తున్న సీనియర్ నటి మణి. ఈ మధ్యకాలంలో బామ్మ పాత్రలకు ఆమె ఫేమస్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడీ స్టేజ్‌పై ఆమె చేసిన డ్యాన్స్‌తో ఇండస్ట్రీ అంతా ఆమె వైపు చూసేలా చేసుకున్నారు మణి. ఆమె మూమెంట్స్ నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచాయి. సోషల్ మీడియాలో ఈ బామ్మ డ్యాన్స్ చేస్తున్న వీడియో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ బామ్మ డ్యాన్స్‌కు షాక్ అవుతున్నారు. సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా చేస్తే.. వేరేవి వంద సినిమాలు చేసినట్లే!

ఇక ఈ వేదికపై హీరో కిరీటి మాట్లాడుతూ అందరి మనసులు దోచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నాకోసం 1 శాతం హిట్ కావాలని కోరుకుంటాను.. నిర్మాత సాయి, దర్శకుడు రాధాకృష్ణ కోసం 99 శాతం సక్సెస్ సాధించాలని కోరుకుంటానని చెప్పడంతో అందరికీ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాత సాయి నా మీద నమ్మకం పెట్టినందుకు ఆయనకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను. ఒక డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీలో ఎంతో మందికి పని దొరుకుతుంది. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసిన జెనీలియా మేడమ్ మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆమె 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాతో కం బ్యాక్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో బబ్లీ గాళ్‌గా కాకుండా చాలా అద్భుతమైన పాత్ర చేశారు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది కెమెరామ్యాన్ సెంథిల్. ఆయన పట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. దేవి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. కళ్యాణ్ అద్భుతమైన మాటలు పాటలు రాశారు. పీటర్ మాస్టర్ ఇందులో ఒక సీక్వెన్స్ చేశారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడూ అలాంటిది చూసి ఉండరు. పీటర్ మాస్టర్ వల్లే ఆ ఫైట్ సాధ్యమైంది. జూలై 18న సినిమా రాబోతోంది. కష్టపడి నిజాయితీగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు. నా కోసమే కాదు, ఈ సినిమాలో కష్టపడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్లందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?