junier( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Junior movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గాలి కిరీటి సినిమా ‘జూనియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Junior movie OTT: గాలి కిరీటీ హీరోగా, డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘జూనియర్’ (Junior Movie) సినిమా థియేటర్లలో అంత గొప్పగా సక్సెస్ సాధించలేదనే విషయం తెలిసిందే. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను ఆహా లో సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మాములుగా అయితే ఈపాటికే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయాలి. కానీ, రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. దసరా పండుగను పురస్కరించుకుని, ఈ సినిమాను ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.

Read also-Manipur attack: జవాన్ల ట్రక్కుపై సాయుధుల దాడి.. ఇద్దరు అస్సాం రైపిల్స్ జవాన్లు కన్నుమూత

ఈ సినిమాలోని ‘వైరల్ వయ్యారి’ పాట ఓ ఊపు ఊపేసిన విషయం తెలియంది కాదు. ఈ పాట కోసం సినిమా చూసిన వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ పాటలో శ్రీలీలతో హీరో కిరీటీ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ పాట ఇప్పటికీ వినబడుతూనే ఉందంటే.. పాటకున్న పవర్, శ్రీలీల గ్లామర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంటుంది.. ఈ దసరాకు శ్రీలీల అభిమానులకు పండగే అని. అవును.. దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని.. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ఆహా ఓటీటీ (Aha Ott)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీ రైట్స్‌ని ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో బొమ్మరిల్లు జెనీలియా సౌత్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read also-Manchu Lakshmi: ఇంటర్వ్యూ కాదు.. ఆ జర్నలిస్ట్ నాపై దాడి చేశాడు.. మంచు లక్ష్మి ఫిర్యాదు వైరల్!

‘జూనియర్’ కథ విషయానికి వస్తే.. అభి (కిరీటి)కి తన లైఫ్‌ని స‌ర‌దాగా లీడ్ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలో అతను స్ఫూర్తి (శ్రీలీల‌) అనే అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తాడు. స్ఫూర్తి ప్రేమించడానికి, ఆమె ప్రేమను పొందడానికి, ఆమె ప‌ని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీ బాస్ విజ‌య సౌజ‌న్య (జెనీలియా).. అభిని అనుక్షణం ద్వేషిస్తుంటుంది. విజయ సౌజన్యకు, అభికి ఉన్న సంబంధం ఏమిటి? ఆమెతో క‌లిసి అభి విజ‌య‌న‌గ‌రం ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కొర్రపాటి నిర్మించారు. మరి థియేటర్లలో ఆడియెన్స్ ఆదరణను రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి ఆదరణను పొందుతుందో చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఆహా ప్రకటించనుంది.

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం