Jr NTR Balakrishna: తెలుగు సినీ ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరో వైపు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మాస్ ఆడియెన్స్ నుంచి అదిరి పోయే రెస్పాన్స్ రావడంతో సీక్వల్ కి కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం, బాలకృష్ణ అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ ను అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Niloufer hospital: బెడ్లు వెయ్యి.. బిల్లులు పదిహేను వందలకు? ఆ హాస్పిటల్‌లో సానిటేషన్ గోల్‌మాల్!
ఇదిలా ఉండగా, గత కొంత కాలం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr NTR ), కళ్యాణ్ రామ్ ( Kalyan Ram) బాబాయ్ బాలయ్య కు (Balakrishna) దూరంగా ఉంటున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, వీటి గురించి ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. అయితే, తాజాగా వీరికి సంబందించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానిలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
బాలకృష్ణ , ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి క్రికెట్ గ్రౌండ్ లో ( cricket Ground) ఆడుతున్న ఓల్డ్ వీడియో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీరి మధ్య ఇంత క్లోజ్ నెస్ ఉందా.. అని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ఓ వైపు , బాలయ్య ఓ వైపు గ్రౌండ్ లోకి బ్యాట్స్ పట్టుకుని మ్యాజిక్ చేశారు. ఇద్దరూ కలిసి బౌండరీస్ బాదారు. ఎన్టీఆర్ అయితే ప్రతి బాల్ ని అటాక్ చేశాడు. బాల కృష్ణ కూడా బ్యాట్ తో తన ప్రతాపం చూపించాడు. ఇద్దరూ ఫ్రెండ్స్ లా ఒకరునికొకరు ఆటపట్టించుకుని భలే ఆడారు. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నందమూరి ఫ్యాన్స్ మళ్లీ మీ ఇద్దరూ ఇలాగే కలిసి ఆడితే చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే మా జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అంటూ తమ అభిమాన హీరోని ఆకాశానికి ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు