Jio Hotstar: దేశీయ ఓటీటీ కూన జియో(Jio).. ప్రపంచ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar) రెండు కలిసి జియో హాట్‌స్టార్(Jio Hotstar)గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. దీంతో చాలా తక్కువ ధరకే నేషనల్, ఇంటర్నేషనల్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇంతకు ఈ యాప్ సబ్ స్క్రిప్షన్‌తో ఏ ఇంటర్నేషనల్ కంటెంట్‌ని యాక్సెస్ చేయొచ్చు, లైవ్‌గా ఎన్ని ఛానల్స్ స్ట్రీమ్ కానున్నాయి, స్పోర్ట్స్ సంగతి ఏంటి, సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ఏంటంటే..
ఈ యాప్‌లో 100 టీవీ ఛానెల్స్ లైవ్ స్ట్రీమ్ కానున్నాయి. అలాగే 30 గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది. ఇప్పటికే ఐపీఎల్(IPL) స్ట్రీమింగ్ హక్కులను జియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు ఐసీసీ టోర్నమెంట్‌లు, కబడ్డీ లాంటి ఇండియన్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌తో పాటు ఫిఫా ఫుట్ బాల్, F 1, టెన్నిస్ వంటి ఇంటర్నేష్‌నల్ స్పోర్ట్స్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అలాగే డిస్నీ+, హులు, పీకాక్, HBO, ఫాక్స్, హాట్‌స్టార్ స్పెషల్స్ వంటి ఇంటర్నేషనల్ కంటెంట్‌ని కూడా ఒకే సబ్‌స్క్రిప్షన్ కింద చూసేయొచ్చు.
(What’s On Jio Hotstar)
ప్లాన్స్ ఇవే
మొబైల్ ప్లాన్
రూ. 149/ 3 నెలలు
రూ. 499/ ఏడాది
* యాడ్స్‌తో కలిపి
* ఈ ప్లాన్‌తో ఏకకాలంలో ఒకే డివైజ్‌లో కంటెంట్ చూసే వెసులుబాటు మాత్రమే ఉంది.
సూపర్ ప్లాన్
రూ. 299/ 3 నెలలు
రూ. 899/ ఏడాది
* యాడ్స్‌తో కలిపి
* ఈ ప్లాన్‌తో ఏకకాలంలో రెండు డివైజ్‌లలో కంటెంట్ చూసే వెసులుబాటు ఉంది.
ప్రీమియం ప్లాన్
రూ. 299/ 1 నెల
రూ. 499/ 3 నెలలు
రూ. 1,499/ ఏడాది
* యాడ్స్ లేకుండా
* ఈ ప్లాన్‌తో ఏకకాలంలో నాలుగు డివైజ్‌లలో కంటెంట్ చూసే వెసులుబాటు ఉంది.
(JioHotstar subscription plans)
Entertainment that never ends. Sports that never stop. Welcome to the best of both worlds.#JioHotstar #InfinitePossibilities pic.twitter.com/4a3jeEAtN6
— JioHotstar (@JioHotstar) February 14, 2025
ఇవి కూడా చదవండి: