Jinn Trailer: భూతనాల చెరువు కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి?
Jinn Movie (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Jinn Trailer: భూతనాల చెరువు కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? ఇది ‘జిన్’ ఆడే ఆట!

Jinn Trailer: సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’ (Jinn Movie). చిన్మయ్ రామ్ (Chinmay Ram) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. సోమవారం హైదరాబాద్‌లో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ (Jinn Movie Trailer)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్‌ను గమనిస్తే..

జిన్ ఎంట్రీ అదుర్స్

ట్రైలర్ మాములుగా లేదు. భూతనాల చెరువు, కాలేజ్‌లో మిస్టరీ అంటూ మొదలైన ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎంగేజ్ చేయడమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిందనే చెప్పుకోవాలి. కొన్ని ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. కాలేజ్‌ చదువుల నిమిత్తం వచ్చిన నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ భవనం నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలో ‘జిన్’ రావడం వంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్‌తోనే అందరినీ భయపెట్టించేశారు మేకర్స్. ఇందులోని విజువల్స్, ఆర్ఆర్ హైలెట్ అనేలా ఉన్నాయి. డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్ర రాబోతుందనే విషయాన్ని ఈ ట్రైలర్‌తో ఇవ్వగలిగారు.

Also Read-Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!

ట్యాగ్ లైన్ బాగుంది

ఈ ట్రైలర్ చూసిన అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘జిన్’ టైటిల్ చాలా బాగుంది. గుడ్ జిన్, బ్యాడ్ జిన్ అని జిన్‌లో రెండు రకాలుంటాయి. హారర్ చిత్రాలకు రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. కరెక్ట్‌గా భయపెడితే ఆడియెన్స్ హారర్ చిత్రాలను ఎలా ఆదరిస్తారో ఇప్పటికే పలుసార్లు నిరూపించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. హారర్ చిత్రాలన్నీ ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. చిన్మయ్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నారు. నటుడు సోహెల్ మాట్లాడుతూ.. టాలీవుడ్ ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాల్ని, అన్ని భాషల టెక్నీషియన్లను ఆదరిస్తుంటారు. ‘జిన్’ సినిమాకు స్పూకీ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ బాగుంది. జిన్‌లో గుడ్ జిన్ ఉంటుంది.. బ్యాడ్ జిన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా నాకనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. ట్రైలర్ చాలా బాగుంది. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ థియేటర్లలో చూడండని చెప్పుకొచ్చారు.

Also Read- VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

‘జిన్’కు అర్థమిదే..

చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ.. మా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసేందుకు డబ్బులు పెట్టి నిర్మించిన నిర్మాత నిఖిల్‌కు థ్యాంక్స్. మా చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆడియెన్స్ అందరూ మా మూవీని థియేటర్లలో చూడండి. మీరు టికెట్‌కు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమా ఇస్తుందని కచ్చితంగా చెప్పగలనని అన్నారు. నటుడు అమిత్ రావ్ మాట్లాడుతూ.. ‘జిన్’ అంటే చాలా మందికి తెలీదు. దెయ్యాలు, ప్రేతాత్మల్ని ముస్లిం మతంలో జిన్ అని పిలుస్తారు. భూతాల్ని భయపెట్టే, వదిలించే వారిని మౌళ్వి అంటారు. నేను ఇందులో మౌళ్వి పాత్రను పోషించాను. ‘జిన్’ చాలా కొత్తగా ఉంటుంది. డిసెంబర్ 19న వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పర్వేజ్ సింబా, మారెళ్ల మణికంఠ, భార్గవ్ రామ్ వంటి వారు ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

Ward Member Dies: గెలిచిన రోజే వార్డు సభ్యుడి మృతి.. విషాద ఘటన

Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..

Chandrababu Naidu: కన్హా శాంతివనంలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఆశ్రమం సందర్శన