Bigg Boss Telugu 9: లాస్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో 5 మెంబర్స్ మిగిలారు. ఇందులో విన్నర్ ఎవరనేది స్పష్టంగా చెప్పడానికి వీలు లేకుండా, ఐదుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇంత పోటీలో కూడా టాప్ 3 పేర్లుగా కళ్యాణ్ (Kalyan), తనూజ (Tanuja), ఇమ్మానుయేల్ (Emmanuel Bigg Boss) పేర్లు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా డిమాన్ పవన్ (Demon Pawan) కూడా టాప్ 3 రేసులోకి దూసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్‌లో రీతూ, భరణి సపోర్ట్ డిమాన్‌కు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వారి అభిమానులందరూ ఇప్పుడు పవన్‌కు సపోర్ట్ చేస్తే మాత్రం.. ఇప్పుడున్న టాప్ 3నే కాదు, విన్నర్‌గా కూడా డిమాన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతోందో? ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 99వ రోజుకు (Bigg Boss Telugu Season 9 Day 99) సంబంధించి బిగ్ బాస్ టీమ్ కొన్ని ప్రోమోలను విడుదల చేసింది. ఈ ప్రోమోలను గమనిస్తే..
Also Read- Funky: విశ్వక్ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా!
పవన్, కళ్యాణ్.. మనసులు దోచేశారు
‘హౌస్ ఎమోషన్స్’ అంటూ వచ్చిన ప్రోమోలో ఇంట్లో ఉన్న సభ్యులందరితో ఎమోషనల్ డ్రామాని బిగ్ బాస్ నడిపిస్తున్నారు. ‘ఇంటి సభ్యులు బిగ్ బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటి? మీ హృదయం నుంచి వచ్చే భావాలను పంచుకోవాలి’ అని ఓ టాస్క్‌ను కళ్యాణ్ చదివి వినిపిస్తున్నారు. ముందుగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. ‘ఏముందిలే సింపుల్‌గా నవ్వించవచ్చు.. కామెడీ షోలు ఎన్ని చేయలేదు నేను.. అనే మైండ్ సెట్‌తో వచ్చా. కానీ, వచ్చిన ఫస్ట్ వీకే హరీష్‌తో పెద్ద గొడవ అయింది. అప్పుడు మా మమ్మీ (సంజన)నే సపోర్ట్‌గా నిలిచింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు చాలా విషయాలు తెలిశాయి’ అని చెబుతున్నారు. ‘నాతో ఎవరైనా 2 వారాలు ఉంటారా? నన్ను భరించగలుగుతారా? అని నేను నా మీదే జోకులు వేసుకుని వచ్చాను. ఇది నాకు ఒక రీ లైఫ్’ అని సంజన చెబుతోంది. డిమాన్ పవన్ చెప్పిన మ్యాటర్‌తో హౌస్‌లోని వారే కాకుండా, చూసే ఆడియెన్స్ కూడా ఎమోషనల్‌కు గురయ్యేలా తన గురించి చెబుతున్నాడు. ‘నాకు నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ లవ్ ఇచ్చిందెవరంటే నా తెలుగు ఆడియెన్స్. ఇక్కడకు వచ్చిన తర్వాత ఉన్నదాంట్లో ఎంత హ్యాపీగా ఉండవచ్చో నేర్చుకున్నాను’ అని తనూజ చెబుతోంది. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ అంటే కావాలని అనిపించే కష్టం. ఇందులో అన్ని కరెక్ట్‌గా ఉంటాయి. అయినా ఇది మనకు కావాలి’ అని చెబుతున్నాడు. మొత్తంగా చూస్తే.. ఈ ప్రోమో ఇంట్లో అంతా ఎమోషనల్ బాండ్ నడుస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
Also Read- VV Vinayak: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?
సంజన, తనూజ ఔట్..
‘నాచోరే నాచోరే’ అంటూ వచ్చిన మరో ప్రోమోలో ‘వన్స్‌మోర్, వన్ లాస్ట్ టైమ్‌లో భాగంగా.. సభ్యులకు ఇస్తున్న టాస్క్ ‘నాచోరే నాచోరే’. సాంగ్స్ ప్లే అవుతుంటాయి, మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకు ఉన్న కలర్ హోల్స్‌లో.. నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటకు రావాలని.. ‘బ్లూ’ అని బిగ్ బాస్ చెప్పగానే పవన్ ఫస్ట్ వచ్చేశాడు. సంజన మాత్రం రాలేదు. ఈ రేసులో సంజన అవుటైంది. తర్వాత బిగ్ బాస్ ఆరెంజ్ కలర్ చెప్పగానే, అప్పుడు కూడా పవనే ఫస్ట్ వచ్చాడు. ఈ రౌండ్‌లో తనూజ అవుటైంది. మూడో రౌండ్‌లో కూడా పవనే ఫస్ట్ వచ్చాడు. కళ్యాణ్ అవుటైనట్లుగా కనిపిస్తున్నాడు. మొత్తంగా చూస్తే ఈ టాస్క్ వెళ్లేముందు మరొక్కసారి బిగ్ బాస్ టాస్క్‌లను హౌస్‌మేట్స్‌కు పరిచయం చేసేందుకు బిగ్ బాస్ ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతోంది. మరి ఈ టాస్క్ ఎఫెక్ట్ ఎవరిపై ఎలా పడుతుందనేది తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

