Funky: వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ (Anudeep KV) కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. టీజర్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారనే విషయం తెలిసింది కాదు. టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని సినీ ప్రియులు వేచిచూసేలా చేసింది. అలాంటి వారందరి కోసం ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా థియేటర్లలో ‘ఫంకీ’ (Funky) చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 13న (Funky Release Date) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవానికి ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఇప్పుడు విడుదల తేదీని మరింత ముందుకు తీసుకు వచ్చేశారు. దీంతో విశ్వక్ అభిమానులు ఫుల్ హ్యాపీ.
Also Read- VV Vinayak: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?
ఈసారి రెట్టింపు నవ్వులతో
నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదానికి పేరుగాంచిన అద్భుతమైన కలయికలో ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి రాబోతున్నారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారనే విషయాన్ని ఆల్రెడీ వచ్చిన టీజర్ హింట్ ఇచ్చేసింది. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన అనుదీప్.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు. ‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తున్నారు. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఇప్పటికే టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్‌కి ప్రశంసలు కురిశాయి. ఈ చిత్రంతో తెలుగు తెరకు కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read- S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్
విశ్వక్-కయాదు జోడి
ఆల్రెడీ కయాదు చేసిన సినిమాలు తెలుగులో వచ్చాయి కానీ, ఇదే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు చిత్రం. ఇందులో కయాదు లోహర్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించనున్నారు. తెరపై విశ్వక్-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. ఇప్పటికే యువత మనసులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. టీజర్‌తోనే సంగీతం ఎంత కొత్తగా, కట్టిపడేసేలా ఉండనుందో స్పష్టమైంది. అద్భుతమైన గీతాలు, నేపథ్య సంగీతంతో భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నారని చిత్రయూనిట్ కూడా చెబుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

