Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ ఫస్ట్ లుక్ విడుదల
Jetlee Vennela Kishore (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల

Jetlee Movie: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వినూత్నమైన కామెడీ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు రితేష్ రానా (Ritesh Rana), వెర్సటైల్ యాక్టర్ సత్య (Sathya) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీ ‘జెట్లీ’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, తాజాగా చిత్ర బృందం క్రిస్మస్ పండుగ కానుకగా ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెన్నెల కిషోర్ ఒక విమానం విండో సీటు దగ్గర కూర్చుని కనిపిస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా, ఒక రకమైన ఇంటెన్సిటీతో చూస్తున్న ఆయన స్టైలిష్ హెయిర్‌స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే, ఇక్కడే దర్శకుడు రితేష్ రానా తన మార్క్ ఫన్‌ను జోడించారు. అదేంటంటే..

Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!

సినిమా సుడోకు

వెన్నెల కిషోర్ చేతిలో ఒక ‘సినిమా సుడోకు’ (Cinema Sudoku) బుక్ ఉంది. రితేష్ రానా గత చిత్రాల తరహాలోనే ఇందులో కూడా క్యారెక్టరైజేషన్లు చాలా విభిన్నంగా, క్లెవర్ రైటింగ్‌తో ఉండబోతున్నాయని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘మత్తు వదలరా’ వంటి హిట్ సిరీస్ చిత్రాల తర్వాత రితేష్ రానా, సత్య జోడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘జెట్లీ’పై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్ ఉండటంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇప్పుడొచ్చిన వెన్నెల కిషోర్ స్టిల్ కూడా సినిమాలో కామెడీ డోస్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజేస్తోంది.

Also Read- Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా

ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. అజయ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు రితేష్ రానా సినిమాలకు వెన్నెముకగా నిలిచే సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సరంగం సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, నార్ని శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. యూనిక్ క్యారెక్టర్స్, సిగ్నేచర్ ఎంటర్‌టైన్‌మెంట్, గ్రిప్పింగ్ నేరేషన్‌తో ‘జెట్లీ’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని టీమ్ చెబుతోంది. క్రిస్మస్ సందడిలో విడుదలైన వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల