Jatasya Maranam Dhruvam
ఎంటర్‌టైన్మెంట్

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ (Jatasya Maranam Dhruvam) టైటిల్ క్రెడిట్ నాదే అన్నారు నటుడు జెడి చక్రవర్తి. ఆయనతో పాటు నరేష్ అగస్త్య (Naresh Agastya), సీరత్ కపూర్ (Seerat Kapoor) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. త్రిష సమర్పణలో సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమా ఫేమ్ ప్రీతీ జంఘియానీ (Preeti Jhangiani) రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనని రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ టీజర్ లాంఛ్ కార్యక్రమంలో..

Also Read- Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

టైటిల్ సజెస్ట్ చేసింది నేనే

జెడి చక్రవర్తి మాట్లాడుతూ.. నిర్మాత మల్కాపురం శివ కుమార్ (Malkapuram Siva Kumar) చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ‘జాతస్య మరణం ధ్రువం’ పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం ముంబైలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మా అందరికంటే సినిమాని ఆయనే ఎక్కువగా నమ్మారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు థాంక్యూ. ఆయనకున్న ప్యాషన్ వలనే సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. సీరత్ మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్, సింగర్ కూడా. తనకి సినిమా అంటే పిచ్చి. ఈ సినిమాలో తన నటన అందరికీ నచ్చుతుంది. నరేష్‌కి, నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. తనకి కూడా చాలా మొహమాటం. డైరెక్టర్ శ్రవణ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమాకు ‘జాతస్య మరణం ధ్రువం’ అనే టైటిల్ సజెస్ట్ చేసింది నేనే. టైటిల్ క్రెడిట్ నాకే దక్కాలి. మలయాళం నుంచి వచ్చే సినిమాలను మనవాళ్లు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆ కోవకి చెందినదే. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని అన్నారు.

Also Read- Nag Ashwin: న్యూ జీఎస్టీ రూల్స్.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

పాన్ ఇండియా సినిమా

‘చాలా ఇంటెన్స్‌గా రాసిన స్క్రిప్ట్ ఇది. ఇందులో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా వచ్చింది. మంచి కన్విక్షన్‌తో చేశాం. జేడీ చక్రవర్తి స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి అడుగులో నాకు సపోర్ట్ చేశారు. ఈ టైటిల్ సూచించింది కూడా ఆయనే’’ అని దర్శకుడు శ్రవణ్ (Shravan Jonnada) చెప్పారు. నిర్మాత మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. కొత్త డైరెక్టర్ శ్రవణ్ చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్‌ని బిలీవ్ చేసి నేను ఈ సినిమా చేస్తున్నాను. జెడి చక్రవర్తి నాకు మంచి స్నేహితుడు. జెడి, నరేష్, సీరత్ కపూర్ మా బ్యానర్‌లో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. సీరత్ ప్రమోషన్స్‌లో చాలా హెల్ప్ చేస్తోంది. నరేష్ చాలా టాలెంటెడ్. డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకుడికి భవిష్యత్తులో మరెన్నో మంచి అవకాశాలు వస్తాయి. ‘తమ్ముడు’ హీరోయిన్ ప్రీతీ జంఘియానీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తన పాత్ర కూడా చాలా బాగుంటుంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం