Jatadhara: నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘జటాధర’ నుంచి విడుదలైన డ్యాన్స్ నెంబర్ ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా (Trend Set Chey Pilloda)’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్స్టంట్ ఎనర్జీ, ఫుల్ ఫన్ వైబ్‌తో రూపొందిన ఈ డ్యాన్స్ నంబర్, యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ స్పెక్టాకిల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండటం విశేషం. ఈ మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ మూవీ నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ఈ మూవీ నుంచి విడుదల చేసిన డ్యాన్స్ నంబర్ సినిమా ప్రమోషన్స్‌కు మరింత ఊపునిచ్చింది.
Also Read- Telugu Indian Idol S4: షోకి గెస్ట్‌గా పిలిచి.. బ్రహ్మానందాన్ని అలా ఏడిపించారేంట్రా? ప్రోమో వైరల్
ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో సుధీర్ బాబు సందడి
ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా సుధీర్ బాబు నిలిచారు. ఎంటర్‌టైనింగ్ బీట్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌కు తోడు సుధీర్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. స్టైలిష్ పబ్ సెట్‌లో తెరకెక్కిన ఈ వీడియోలో సుధీర్ బాబు, శ్రేయా శర్మతో కలిసి స్టైలిష్ మూవ్స్‌తో అదరగొట్టారు. స్మార్ట్ కొరియోగ్రఫీ, కూల్ వైబ్‌తో ఈ పాట నిజంగానే టైటిల్‌కు తగ్గట్టుగా కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. మరీ ముఖ్యంగా శ్రేయా శర్మ అందాల విందు ఈ పాటను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా గ్లామర్ షో టాలీవుడ్‌లో అయితే అంతగా రాలేదనే చెప్పాలి. ఆ రేంజ్ శ్రేయా వర్మ అల్లాడించేసింది.
సంగీతం, సాహిత్యం హైలైట్స్
‘ట్రెండ్ సెట్ చెయ్’ పాటను రీస్ అండ్ జైన్ – సామ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ యూత్‌ఫుల్ ఎనర్జీతో అదిరిపోయింది. లిరిసిస్ట్ శ్రీమణి తెలుగు పదాలకు ఇంగ్లీష్‌ను మిక్స్ చేస్తూ, ఆకట్టుకునే వర్డ్ ప్లేతో సాంగ్‌ను ట్రెండీగా, యువతకు కనెక్ట్ అయ్యేలా రాశారు. జితేందర్, రజీవ్ రాజ్ తమ శక్తివంతమైన వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీ ఇచ్చారు. ఈ హుషారెత్తించే పాట విడుదలైన వెంటనే వైరల్ అవుతోంది. ఈ సినిమా సుధీర్ బాబుకు ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొడతానని సుధీర్ బాబు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ పరంగా మాత్రం, ఈ సినిమా భారీ సక్సెస్ అవుతుందనే ఫీల్‌ని మాత్రం ఇస్తోంది. చూద్దాం.. ఫైనల్‌గా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
