Jabardasth Tanmay ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Jabardasth Tanmay: సూసైడ్ ఆలోచనలు వచ్చాయి.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అన్నారు.. జబర్దస్త్ తన్మయి

Jabardasth Tanmay: జబర్దస్త్ తన్మయి ( Jabardasth Tanmay )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ నిజాలను వెల్లడించింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read:  Gold Rate Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

నా జీవితంలో ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నది లేదు. జబర్దస్త్ వల్ల కొంచం పేరు వచ్చింది. ఇల్లు కట్టుకున్నాను. ఫ్యామిలీని బాగా చూసుకున్నాను. కానీ, వ్యక్తిగత జీవితంలో చాలా డ్యామేజి అయింది. అసలు ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. ఒక ప్రేమ లేదు, కుటుంబం నుంచి సపోర్ట్ లేదు. బయట కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. ఫ్రెండ్స్ కూడా లేరు. ఎక్కడ చూసిన ఫేక్ అంతా.. నమ్మి మోసం పోవడం తప్ప ఇంకేముంది అసలు అంటూ చాలా ఎమోషనల్ అయింది.

Also Read:  Singer Pravasthi: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ ప్రవస్తి.. ఒక్క దెబ్బకి అందరికీ ఇచ్చిపడేసిందిగా..!

నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను అంటూ తన లైఫ్ లో జరిగిన విషయాలను బయటకు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తన్మయి మాట్లాడుతూ.. . నేను ఒక పర్సన్ ను ఎనిమిదేళ్లు లవ్ చేశాను. నేను నా ఫ్యామిలీనే కాకుండా, తన ఫ్యామిలీని కూడా చూసుకున్నాను. తను కూడా మా ఇంటి దగ్గరే ఉండేవాడు. కానీ, వాడు నన్ను లవ్ చేయలేదు. నా డబ్బును లవ్ చేశాడు. నన్ను దారుణంగా అంటే చాలా దారుణంగా మోసం చేశాడు. అందరూ నాలో అవే చూశారు.. ఒక్కరూ కూడా నన్ను ప్రేమించలేదు. ఇక, అప్పటి నుంచి ఈ లవ్ అవసరం లేదనిపించిందని చెప్పిందంటూ ఏడ్చుకుంటూ చెప్పింది.

Also Read:  Shrasti Verma : బిగ్ బ్రేకింగ్.. సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మపై కేసు నమోదు

ఆమె ఇంకా మాట్లాడుతూ ” నెల రోజుల క్రితం సూసైడ్ ఆలోచనలు వచ్చాయి.. డబ్బులు లేవు.. ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. నా స్నేహితులందరు మోసం చేశారు. ఫ్యామిలీ, రిలేటివ్స్, చివరికి ఇండస్ట్రీ వాళ్ళు కూడా మోసం చేశారు. అందరికి నా డబ్బు మాత్రమే కావాలి. నేను అవసరం లేదు. నాతో తిరిగే వాళ్ళు ఒక్కరూ కూడా ఫుడ్ పెట్టరు. నా ప్రాబ్లమ్స్ ఎవరూ చేసుకోరు ” అంటూ ఎమోషనల్ అయింది.

మా నాన్న హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాను. వాళ్ళు నువ్వు ఇక్కడ ఉండాలంటే.. ఇండస్ట్రీ వదిలేయ్ అని అన్నారు. ఆ ఒక్క విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను కొట్టడం, తిట్టడం, ఫోన్ చేసి బాగా విసిగించారు. బయటకు చెప్తే మా ఇంట్లో వాళ్ళు బాధపడతారని .. నాలో నేను చాలా అంటే చాలా వేదనకు గురయ్యాను. ఇంకా, వాళ్ళు
నన్ను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తా అని బెదిరించారని చెప్పారు. వామ్మో ఈ బాధ అంతా దేని అని భయంతో ఓ రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా అంటూ ఏడ్చుకుంటూ చెప్పింది.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది