Madhoo
ఎంటర్‌టైన్మెంట్

Madhoo: లిప్‌ కిస్‌‌ చేయకూడదని అనుకున్నా, చేయాల్సి వచ్చింది.. కానీ?

Madhoo: నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడే లిప్ కిస్, ఎక్స్‌పోజింగ్ వంటివి చేయకూడదని షరతు పెట్టుకున్న నేను.. ఓ సినిమా కోసం ఆ షరతును పక్కన పెట్టి లిప్ కిస్ చేయాల్సి వచ్చిందని అన్నారు సీనియర్ నటి మధుబాల. ‘రోజా’ సినిమాతో పాపులర్ అయిన ఈ నటి, ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటిలోనూ ఎటువంటి వల్గారిటీకి చోటివ్వకుండా, చాలా పద్ధతిగా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆమె నటిస్తూనే ఉన్నారు. తాజాగా మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa)లో మధుబాల ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో మధుబాల కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘లిప్ కిస్’పై సంచలన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా‌ ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!

ఈ ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. ‘‘ఎక్స్‌పోజింగ్, లిప్ కిస్ వంటి సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. అందుకే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడే నాకు నేనుగా ఒక షరతు విధించుకున్నాను. లిప్ కిస్, ఎక్స్‌పోజింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని అనుకున్నాను. అలాగే ఉంటూ వచ్చాను. నేను విధించుకున్న ఆ షరతు కోసం.. ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా వదులుకున్నాను. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం నేను నా షరతును పక్కన పెట్టాల్సి వచ్చింది. సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత ఓ రోజు సెట్‌లోకి వెళ్లిన నాకు ముద్దు సన్నివేశం చేయాలని చెప్పారు. కానీ, నేను ముందే చెప్పాను కదా.. అని వాళ్లతో వివరంగా చెప్పాను. ఆ సన్నివేశం ఆ సినిమాకు ఎంతో కీలకమని టీమ్ చెప్పడంతో.. ఇక తప్పదని ఓకే చెప్పి, ఆ సన్నివేశంలో యాక్ట్ చేశాను. చాలా ఇబ్బంది పడుతూనే ఆ సన్నివేశంలో పాల్గొన్నాను. కానీ, ఫైనల్ కట్‌లో ఆ సన్నివేశం అవసరం లేదని, ఎడిటింగ్‌లో ఆ ముద్దు సీన్‌ని తొలగించారు. ఎందుకు తొలగించారు? అని నేనేం వాళ్లతో గొడవ పడలేదు. కాకపోతే ఆ తర్వాత సీనియర్ నటీమణులను చూసి కొన్ని తెలుసుకున్నాను. నటిగా వచ్చిన తర్వాత ఎలాంటి సన్నివేశాలైనా చేయాలని వారిని చూశాకే అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Viral Video : దువ్వాడ- మాధురి రొమాన్స్.. బద్ధలవుతున్న సోషల్ మీడియా

‘రోజా’ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపును సొంతం చేసుకున్న మధుబాల.. డైరెక్ట్ టాలీవుడ్ చిత్రం మాత్రం యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ (Raja Sekhar) సరసన చేసిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రమే. ఆ తర్వాత కూడా రాజశేఖర్ సినిమానే ఆమె టాలీవుడ్‌లో చేశారు. ‘ఆవేశం’తో మళ్లీ ఆమె టాలీవుడ్‌ని పలకరించారు. మధ్యలో అర్జున్ ‘జెంటిల్‌మ్యాన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అది డైరెక్ట్ తెలుగు సినిమా కాదు. ‘ఆవేశం’ తర్వాత ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’, ‘చిలక్కొట్టుడు’, ‘గణేష్’ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. బాలీవుడ్‌లో సల్మాన్, షారుఖ్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా, చివరి నిమిషంలో చేజారిపోయేవని ఆమె తెలిపారు. మళ్లీ ‘కన్నప్ప’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ‘కన్నప్ప’లో తనకు చాలా మంచి పాత్ర చేసే అవకాశం వచ్చిందని, అందుకు కారణమైన వారికి ఆమె ధన్యవాదాలు చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు