Chiranjeevi and Bandla Ganesh (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Bandla Ganesh: మా బాస్ కోసమే ఆ కుర్చీ చేయించా.. మనసు ఉప్పొంగింది!

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇటీవల దీపావళి సందర్భంగా ఇచ్చిన విందులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) వంటి అగ్ర తారలు పాల్గొనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, ఈ పార్టీలో చిరంజీవి కోసం బండ్ల గణేష్ ప్రత్యేకంగా చేయించిన సింహాసనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘మా బాస్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వస్తున్నారని ఆప్యాయంగా ఆ సింహాసనం తయారు చేయించుకున్నాను. ఆ స్థానంలో ఆయన కూర్చున్న ఆ క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది. లవ్ యూ అన్నయ్య’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. చిరంజీవి కూర్చున్న సింహాసనం ఫోటోలను పంచుకుంటూ, తన ఆనందాన్ని పంచుకున్నారు. చిరంజీవిపై ఆయనకున్న అభిమానం, గౌరవం ఈ ట్వీట్‌లో స్పష్టంగా కనిపించింది.

Also Read- Megastar Chiranjeevi: చిరంజీవి ఇంట అగ్రతారల దీపావళి సందడి.. ఫొటోలు వైరల్!

ఈ కాకా పట్టుడు వెనుక కోరిక ఏదైనా..

చిరంజీవిని బండ్ల గణేష్ ‘బాస్’ అని సంబోధించడం, ఆయన కోసం ప్రత్యేకంగా ఖరీదైన కుర్చీని తయారు చేయించడం, ఆయన కూర్చున్నందుకు మనసు ఉప్పొంగిపోయిందని ప్రకటించడం చూస్తుంటే, దీని వెనుక కేవలం అభిమానం మాత్రమే కాకుండా, ఏదైనా వృత్తిపరమైన ఉద్దేశం ఉందా అనే చర్చ మొదలైంది. బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, అలాగే అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించే నిర్మాతగా సుపరిచితులు. గతంలో ఆయన పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ (Pawan Kalyan Gabbar Singh) వంటి బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మించారు. మెగా ఫ్యామిలీ (Mega Family)తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్.. మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ ప్లాన్

చిరంజీవికి బండ్ల గణేష్ ప్రత్యేక గౌరవం ఇవ్వడం, తన భక్తిని బహిరంగంగా ప్రకటించడం, చిరంజీవిని ప్రశంసించడం అనేది.. ఆయనతో ఒక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, చిరంజీవి స్థాయి హీరోతో సినిమా అంటే, అది సాధారణ విషయం కాదు. అందుకు నిర్మాతకు చిరంజీవిపై ఉన్న అభిమానంతో పాటు, ఆయనతో సన్నిహిత సంబంధాలు, ఆ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించాలనే నిబద్ధత ఉండాలి.

Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!

బాస్ సింహాసనం

ఒకవేళ ఈ సింహాసనం రెస్పెక్ట్ వెనుక చిరంజీవి కోసం సినిమా ప్లాన్ చేసే ఆలోచన ఉంటే, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. బండ్ల గణేష్ గతంలో చేసిన భారీ సినిమాలు, ఆయనకున్న మెగా ఫ్యామిలీ బాండింగ్ చూస్తుంటే, ఆయన ప్రయత్నం ఫలించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి, బాస్ కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ సింహాసనం ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త సినిమా చర్చకు వేదికగా మారిందనే చెప్పాలి.

 

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?