Samantha: స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’ (Subham). ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. హీరోయిన్‌గా ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదు.. అందుకే నిర్మాతగా మారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఈ సంస్థను స్థాపించి, మొదటి చిత్రంగా ‘శుభం’ అనే సినిమాను చేశానని చెబుతోంది సమంత. ‘శుభం’ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో సమంత కూడా యమా యాక్టివ్‌గా పాల్గొంటుంది. మంగళవారం తెలుగు మీడియాతో ముచ్చటించిన సమంత.. చిత్రానికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంది.
Also Read- Robinhood OTT: థియేటర్లలో తుస్.. ‘రాబిన్‌హుడ్’ ఓటీటీలో ఏం చేస్తాడో?
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… నటిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. ఇప్పుడు నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడర్థమైంది. దాదాపు వారం రోజులుగా ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కథ, ఈ సినిమాపై నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. నటిగా ఎన్నో చూశాను. హిట్స్, ఫ్లాప్స్ నాకేం కొత్త కాదు. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన నాలో ఉండింది. ఈ మధ్య తీసుకున్న రెస్ట్ టైమ్‌లో బాగా ఆలోచించి, నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నాను. ముందు ముందు నటిగా ఎలా ఉంటుందో తెలియదు. కానీ నిర్మాతగా మంచి కథలతో సినిమాలు తీసుకుంటూ ఇండస్ట్రీలోనే ఉండొచ్చనే ఆలోచనతోనే ఈ బ్యానర్ స్థాపించాను. ఎలాంటి హడావుడి లేకుండా కామ్‌గా ‘శుభం’ సినిమాను 8 నెలల్లో పూర్తి చేశాం. (Samantha Interview)
ఈ సినిమాకు ‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి, అలాగే నా బ్యానర్‌కు ట్రా లా లా అని పేరు పెట్టడానికి కారణాలు ఉన్నాయి. సీరియల్స్ ఎప్పుడు పూర్తయ్యి శుభం కార్డు పడుతుందో అని అంతా భావిస్తుంటారు. ఈ సినిమా సీరియల్స్‌పైనే ఉంటుంది. అందుకే ‘శుభం’ అనే టైటిల్ పెట్టాం. అలాగే చిన్నప్పటి ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యంలోని ట్రా లా లా తో బ్యానర్ పెట్టాను. గౌతమ్ మీనన్ నాకు మొదటి అవకాశం ఇచ్చారు. నేను కూడా కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చి, వాళ్లని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే నిర్మాతగా మారాను. ఈ సినిమాలో చేసిన వారంతా ఎంతో గొప్పగా నటించారు. ఇంకా చెప్పాలంటే నా పాత రోజుల్ని గుర్తుకు తెచ్చారు.
Also Read- Hari Hara Veera Mallu: ఇక ఎవరూ ఆపలేరు.. ఈసారి వీరమల్లు రావడం పక్కా!
నేను నటిగా ఉన్నప్పుడు నిర్మాతలు పడే కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు ఒక సీన్ అనుకున్నట్లుగా రాకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలిసి వచ్చింది. ఎంత డబ్బు వృధా అవుతుందో తెలిసింది. ఎంత మంది టైమ్ వేస్ట్ అవుతుందనే విషయాలన్నీ నాకు తెలిసి వచ్చాయి. ఈ సినిమాలో కేమియో పాత్ర నేను చేయాల్సింది కాదు. ఇది నిర్మాతగా నా మొదటి సినిమా. దీని కోసం ఎవరినీ ఫేవర్ చేయమని అడగాలనుకోలేదు. అందుకే ఆ పాత్ర నేనే చేసేశా. ఈ మూవీ ఇంకా మూడు, నాలుగు రోజులు మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఆ తర్వాత భారమంతా ప్రేక్షకులదే. ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టాం. ఎక్కువ పెట్టలేదు, అలా అనీ తక్కువా పెట్టలేదు. ఈ కథకు ఏమేం కావాలో అవన్నీ సమకూర్చాం. మే 9న రిలీజ్ అవుతున్న మా ‘శుభం’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయాలని, మా బ్యానర్‌ని ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు