Robinhood Movie
ఎంటర్‌టైన్మెంట్

Robinhood OTT: థియేటర్లలో తుస్.. ‘రాబిన్‌హుడ్’ ఓటీటీలో ఏం చేస్తాడో?

Robinhood OTT: నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ చిత్రం థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు, ఓ గెస్ట్ రోల్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ కనిపించిన విషయం తెలిసిందే. ఆయనని కూడా ప్రమోషన్స్‌కి వాడారు. సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్, థియేటర్స్ అన్నీ లభించినా కూడా, కంటెంట్ ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా భారీ పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడీ సినిమా సంక్రాంతికి వచ్చిన హిట్టు బొమ్మ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఫాలో అవుతూ ఓటీటీతో పాటు సేమ్ టైమ్‌లో టీవీ ప్రీమియర్ కూడా కాబోతోంది.

Also Read- Hari Hara Veera Mallu: ఇక ఎవరూ ఆపలేరు.. ఈసారి వీరమల్లు రావడం పక్కా!

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా జీ5 ఓటీటీ ఇదే ప్లాన్‌తో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓటీటీ విడుదలకు ముందు ఈ సినిమా విషయంలో పెద్ద కన్ఫ్యూజనే నెలకొంది. కానీ ఈసారి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, చేయకుండా మేకర్స్ క్లారిటీగా చెప్పేశారు. ఈ సినిమా మే 10 నుంచి జీ5 ఓటీటీలో పాటు జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ కాబోతోంది. థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సస్పెన్స్, ట్విస్ట్స్, ఎవరూ ఊహించని మలుపులతో దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ, అది ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారనే భావన చిత్ర టీమ్‌లో ఉంది. ఓటీటీ విడుదల తర్వాత కచ్చితంగా మేము అన్నకున్న విజయం ఈ రూపంలో పొందుతామని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ, టీవీ ప్రీమియర్ సందర్భంగా చిత్ర టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంది. హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘‘రాబిన్‌హుడ్‌లో హీరో సాధార‌ణ‌మైన వ్యక్తి కాదు.. తెలివైనవాడు. ఎలాంటి భ‌యం లేకుండా సమాజంలోని త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే వ్య‌క్తి. ఆధునిక రాబిన్‌హుడ్‌గా ధనవంతుల దగ్గర ధనం కొట్టేసి పేద‌వారికి సాయం చేసే పాత్రలో న‌టించటం ఓ కొత్త అనుభ‌వాన్నిచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా మెప్పిస్తుందని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘‘హై వోల్టేజ్ యాక్ష‌న్‌, స‌స్పెన్స్‌, ఎమోష‌న్స్‌తో ఈ సినిమా కథను రెడీ చేశాను. హీరో నితిన్ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోశాడు. స‌మాజంలో జ‌రిగే త‌ప్పుల‌ను సరిదిద్ద‌టానికి ఓ బాట‌ను ఎంచుకున్న మ‌నిషి క‌థ‌ ఇది. ఉత్కంఠ‌త‌తో, హై ఓల్టేజ్ యాక్షన్‌తో సాగే ఈ సినిమాను జీ5లో ప్రేక్ష‌కులు ఎలా ఎంజాయ్ చేస్తారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల‌ని ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నానని తెలిపారు.

Also Read- Ketika Sharma: ‘సింగిల్’.. రష్మికాను టార్గెట్ చేస్తున్న కేతిక, మ్యాటరిదే!

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ఇందులో తెలివైన‌, ధైర్య‌వంతురాలైన‌, స‌వాళ్ల‌ను స్వీక‌రించే నీరా పాత్ర‌లో న‌టించాను. నా పాత్ర‌లో చాలా కోణాలుంటాయి. నితిన్ పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు, తెర‌కెక్కించిన విధానం సూప‌ర్బ్‌గా ఉంటుంది. త‌ను రాబిన్‌హుడ్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. జీ5 ప్రేక్ష‌కుల‌ను అలరించ‌టానికి సిద్ధ‌మైన ఈ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఈ అద్భుత‌మైన ప్ర‌యాణంలో ఓ భాగం కావ‌టం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. కొన్ని అనివార్య ప‌రిస్థితుల కార‌ణంగా రాబిన్‌హుడ్‌గా మారిన రామ్.. ధ‌న‌వంతుల నుంచి ధనాన్ని దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి, పేదలకు సాయం చేస్తుంటాడు. అలా అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి కింగైన వ్య‌క్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. అక్క‌డి నుంచి రామ్ క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది? ఆయన కథలోకి నీరా (శ్రీలీల‌) ఎలా వచ్చింది. అంతా బాగుంద‌ని భావిస్తున్న త‌రుణంలో క‌థలో వచ్చిన ట్విస్ట్ ఏంటి?. అప్పుడు రామ్‌, నీరా ఏం చేశారు? వారికి వచ్చిన స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?