Hari Hara Veera Mallu: ఇక ఎవరూ ఆపలేరు.. ఈసారి రావడం పక్కా!
Hari Hara Veera Mallu Team
ఎంటర్‌టైన్‌మెంట్

Hari Hara Veera Mallu: ఇక ఎవరూ ఆపలేరు.. ఈసారి వీరమల్లు రావడం పక్కా!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఈ సినిమాకు సంబంధించి పూర్తి చేయాల్సిన షూట్ ఇంకా మిగిలే ఉందనేలా ఇప్పటి వరకు వినిపిస్తూ వచ్చింది.  ఆ మిగిలి ఉన్న పార్ట్‌ని కేవలం రెండంటే రెండే రోజుల్లో పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. మంగళవారంతో ఈ సినిమా పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ఫ్యాన్స్‌లో ఆనందం నింపారు.

Also Read- Ketika Sharma: ‘సింగిల్’.. రష్మికాను టార్గెట్ చేస్తున్న కేతిక, మ్యాటరిదే!

పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో పాటు, ఈ మధ్య ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అందుకే నిర్మాత ఏఎమ్ రత్నం రెండు మూడు సార్లు విడుదల తేదీని మార్చుకోవాల్సి వచ్చింది. రెండు రోజుల షూటే కదా.. పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని భావించి, నిర్మాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ, ఆ రెండు రోజుల షూట్ కోసం ఇంత టైమ్ పట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తియిందని, ఇక నిర్మాణానంతర పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ పనులు మొదలెట్టారు.

ఈ రెండు రోజుల షూటింగ్ మినహా రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి, కొద్దిగా ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోలేదు. షూటింగ్ ఎలాగూ పూర్తయింది కాబట్టి, ప్రమోషన్స్‌పై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నారు. ఇక రెండు మూడు రోజుల తర్వాత నుంచి ‘హరి హర వీరమల్లు’ పేరు ఇండస్ట్రీలో మారుమోగేలా, ప్రమోషన్స్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. వీరమల్లు షూటింగ్ పూర్తయింది కాబట్టి.. నెక్ట్స్ ‘ఓజీ’ చిత్ర షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారని తెలుస్తుంది. ‘ఓజీ’ టీమ్ కూడా పవన్ రాక కోసం వేచి చూస్తోంది.

Also Read- Varun Tej: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్ .. తండ్రి కాబోతున్నా అంటూ పోస్ట్..

చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఇందులో కనిపించనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. ఇంతకు ముందెన్నడూ చూడని, కనిపించని సరికొత్త అవతార్‌లో పవర్ స్టార్ ఇందులో కనిపించి, ప్రేక్షకులకు కిక్ ఇవ్వబోతున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో త్వరలోనే థియేటర్లలోకి దిగనున్నాడు.

పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి కొంతమేర దర్శకుడిగా వ్యవహరించిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఏఎం రత్నం తనయుడు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!