Kiran Abbavaram: ‘క’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం ‘దిల్ రూబా’ (Dilruba). రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తూన్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. న్యూ ఏజ్ కమర్షియల్ చిత్రంగా ఈ నెల 14న హోలీ పండుగ స్పెషల్‌గా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. మంగళవారం హీరో కిరణ్ అబ్బవరం మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
‘దిల్ రూబా’ ఔట్ పుట్ చూశాక చాలా హ్యాపీగా, కాన్పిడెంట్‌గా ఉన్నాం. ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా మహిళల పట్ల గౌరవాన్ని పెంచేలా ఉంటుంది. 2 గంటల 20 నిమిషాల నిడివితో రానున్న ఈ చిత్రం.. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఒక మంచి మూవీని చూశామనే ఫీల్‌తో వస్తారని కచ్చితంగా చెప్పగలను. ‘క’ కంటే ముందు చేసిన సినిమా ఇది. ఇందులో కొత్తగా ఏదీ ఉండదని అనుకుంటారేమో.. మహా అయితే ఒక 10 టు 20 పర్సెంట్ సీన్లు ఎక్కడైనా చూసిన ఫీల్ కలగవచ్చు కానీ, మిగతా మూవీ అంతా న్యూ ఏజ్ కమర్షియల్ దారిలోనే ఆడియెన్స్‌ని అలరిస్తుంది. ఇందులో ఏదో ఉంటుందని భారీగా ఊహించుకోవద్దని చెబుతూ.. ముందుగానే మేము కథ రివీల్ చేశాం. ఈ సినిమాతో ప్రేమలోని మ్యాజిక్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం చెప్పగలను. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పకూడదనేది ఇందులోని హీరో మైండ్ సెట్. వాటికి ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఎక్స్ లవర్, ప్రెజెంట్ లవర్స్‌ను కలపడం అనేది ఇందులోని న్యూ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం మాత్రమే జరిగింది. కానీ ‘దిల్ రూబా’లో మాత్రం ఎక్స్ లవర్‌తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వవచ్చనే మంచి పాయింట్‌ను చూస్తారు. ‘క’ సక్సెస్ తర్వాత ‘దిల్ రూబా’లో చాలా ఛేంజెస్ చేశాం. (Kiran Abbavaram Interview)
Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’
డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల పాత్రలు ఎలా అయితే ఉంటాయో, ఇందులో హీరో సిద్ధు నమ్మే సిద్దాంతం, అతను చెప్పే డైలాగ్స్ అలా ఉంటూ, ఆలోచింపజేస్తాయి. హీరో సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్పడు. అందుకు కారణం ఏమైనా ఉందా?. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చేసే సమయంలో నాలో కూడా చాలా మార్పు వచ్చింది. అయినదానికి, కానీదానికి పదే పదే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువను తగ్గించకూడదని అనుకున్నాను. మనిషి మోసం చేసినప్పటి నుంచే గాడ్ అతనితో మాట్లాడటం మానేశాడు, తప్పు చేయని ప్రతివాడూ హీరోనే. కానీ చేసిన తప్పు తెలుసుకున్నవాడు ఇంకా పెద్ద హీరో. ఇలా ఉంటుంది హీరో మనస్తత్వం. ఎవరినీ ఇబ్బంది పెట్టే సీన్లు, డైలాగ్స్ ఇందులో ఉండవు. 3 సంవత్సరాల క్రితం చేసిన సినిమా ఇది. అప్పటికి ‘డ్రాగన్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రారంభం కూడా జరగలేదు. ఆ సినిమాలకు, ‘దిల్ రూబా’కు ఎటువంటి పోలికా ఉండదు. నాకు ఒక్కటే ఆవేదనగా ఉంది. తమిళ సినిమాలకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా, వెంటనే టాలీవుడ్‌లో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. కానీ తెలుగు సినిమాలకు మాత్రం తమిళనాట అంత స్కోప్ ఇవ్వడం లేదు. అక్కడి ప్రేక్షకులు కూడా మన సినిమాలను ఆదరించడం లేదు.

ఇంతకు ముందు కొన్ని సినిమాలను మొహమాటానికి చేశాను. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ‘క’ (KA Movie) సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమాలు చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఈ నాలుగు చిత్రాలు వేటికవే పూర్తిగా భిన్నమైనవిగా ఉంటాయి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. లంకె బిందెలపై చేసే కథ చాలా పెద్దది.. అందుకే 3 భాగాలుగా చేయాలనుకుంటున్నాం. ఈ ఇయర్ నేను నటించినవి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ సంవత్సరం నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నానని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక
SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!