Prakash Raj: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై మరోసారి ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలతనికి ఏం తెలియదు అంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ప్రకాశ్ రాజ్‌కు బీజేపీ భావజాలం నచ్చదనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. జస్ట్ ఆస్కింగ్ అని ఎప్పుడూ ఏవేవో పోస్ట్‌లు పెడుతూ ఉంటారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ జనసేన (Janasena) పార్టీ విషయంలో పాజిటివ్‌గానే ఉన్న ప్రకాశ్ రాజ్.. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో.. అప్పటి నుంచి ఏదో రకంగా విమర్శిస్తూనే ఉన్నారు.
తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నలు ప్రకాశ్ రాజ్‌కు ఎదురయ్యాయి. ‘పవన్ కళ్యాణ్‌కు ఇప్పటి వరకు ఒక విజన్ లేదని నాకు అనిపిస్తుంది. సమస్యల గురించి ఒక అవగాహన ఆయనలో కనబడలేదు. ఒకరిని తిడతాడు.. సడెన్‌గా వెళ్లి ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు. ఇలా ఎవరో ఒక పేరు తీసుకుని మాట్లాడుతుంటాడు. నేను ఒక్కటే చెబుతాను.. పేర్లు తెలిస్తే, మనుషులు తెలిసినట్టు కాదు’.
Also Read- Pawan Kalyan: అజిత్ పేరు ప్రస్తావిస్తూ.. పద్మభూషణులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
తిరుపతి లడ్డు ఇష్యూలో మీరొక ట్వీట్ పెట్టారు.. దానిపై చాలా చర్చ జరిగింది.. దాని గురించి ఏమంటారని అడిగితే.. ‘పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోడు. ఆయన మనకి అర్థం కాడు అని అంటుంటారు కదా.. బేసిగ్గా అసలు ఆయనకి ఏం తెలియదు’ అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు.
ఆయన నియోజకవర్గంలో కూడా ఇటీవల ఒక కుల బహిష్కరణ అంశం వెలుగులోకి వచ్చింది. ఎందుకు పవన్ కళ్యాణ్ హిందుత్వం వైపు టర్న్ తీసుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మహారాష్ట్ర వెళ్లి.. మహారాష్ట్ర ప్రజల్లో ఇంతుందని నాకు తెలియదు అంటాడు. తమిళనాడు వెళ్లి.. అక్కడ ఇంతుందని తెలియదు అంటాడు. అరె.. నీ నియోజక వర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా.. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్.. ఇవన్నీ నీకెందుకు అని అంటాను నేను’’.
అడిగే జోసఫ్ గాడో వేదాంతి చెప్పే రాజ్ గాడు ఇంకో సిద్ధాంతి..
అరేయ్ సోంభేరి.. నువ్వు కర్ణాటక లో MP గా పోటీ చేసి ఓడిపోయావ్.. చివరికి ఇక్కడ మా ఎన్నికల్లో విష్ణు చేతిలో ఓడిపోయిన నువ్వు దేశ రాజకీయాలు మాట్లాడొచ్చు.. ఆయన మాట్లాడకూడదు..
మీలాంటి నా సన్స్ ఉండబట్టే దేశం ఇంకా వెనక్కి… pic.twitter.com/bwl07iq7CO
— uppalapati Ram varma (@uppaalapatiRam) April 29, 2025
జనసేనని ఏమైనా అంటే బూతులు తిడుతుంటారు కదా.. అనే దానికి చెబుతూ.. ‘‘నేను గుడ్ మార్నింగ్ పెట్టినా కూడా వారు బూతులు తిట్టేందుకు రెడీగా ఉంటారు..’’ అని ప్రకాశ్ రాజ్ ఈ ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఇది జస్ట్ ప్రోమోనే. ఫుల్ వీడియోలో ఇంకెంతగా పవన్ కళ్యాణ్‌ని ఆయన టార్గెట్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Rithu Chowdary: వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ.. రూ. 700 కోట్ల స్కామ్‌పై రీతూ షాకింగ్ కామెంట్స్!
అయితే ఈ ప్రోమో చూసిన వారంతా ప్రకాశ్ రాజ్‌కి మాములుగా కౌంటర్స్ వేయడం లేదు. ఇంటర్వ్యూ చేసే వాడిని కూడా కలిపి.. ‘అడిగే జోసఫ్ గాడో వేదాంతి చెప్పే రాజ్ గాడు ఇంకో సిద్ధాంతి. అరేయ్ సో**రి.. నువ్వు కర్ణాటకలో MPగా పోటీ చేసి ఓడిపోయావ్.. చివరికి ఇక్కడ మా ఎన్నికల్లో విష్ణు చేతిలో ఓడిపోయిన నువ్వు దేశ రాజకీయాలు మాట్లాడొచ్చు.. ఆయన మాట్లాడకూడదు. మీలాంటి నా స* ఉండబట్టే దేశం ఇంకా వెనక్కి వెళుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఇంకా జోగి జోగి రాసుకున్నట్లు ఉంది ఈ వీడియో చూస్తుంటే అని ఒకరు, ‘ఒకప్పుడు కత్తి మహేశ్, పోసాని, రామ్ గోపాల్ వర్మ ఎలాగో ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంతే. ప్రజల సమస్యలు కూడ తెలియని వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే. ఆయన చేసిన అభివృద్ధి, సహాయం గురించి మాట్లాడడు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి ప్రకాష్ రాజ్‌కి కనపడదు, వినపడదు’ అని మరొకరు.. ఇలా ఈ ప్రోమోపై కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు