Ajith, Pawan and Balayya
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: అజిత్ పేరు ప్రస్తావిస్తూ.. పద్మభూషణులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Pawan Kalyan: సినిమా రంగానికి సంబంధించి, ఎవరు ఎలాంటి కీర్తి గడించినా ముందుగా శుభాకాంక్షలు చెప్పే వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM Pawan Kalyan), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆ హీరో, ఈ హీరో అనే భేదాలు లేకుండా అందరిపట్ల ఆయన అంతే ప్రేమను కనబరుస్తారనేదానికి తాజాగా జరిగిన పద్మ అవార్డుల వేడుకే ఉదాహరణ. ఈ వేడుకలో పద్మభూషణ్ పురస్కారం (Padma Bhushan Awards) అందుకున్న తెలుగు నటుడు, నందమూరి నటసింహం బాలయ్యకే (Natasimham Balayya) కాకుండా, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar)కు కూడా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు బాలయ్య పేరు మీద, అజిత్ పేరు మీద ప్రత్యేకంగా ఆయన లేఖలు విడుదల చేశారు.

Also Read- Hebha Patel: అది లేకపోతే బతకలేను.. నైట్ ను బాగా ఎంజాయ్ చేస్తా.. హెబ్బా పటేల్ కామెంట్స్

ముందుగా బాలయ్య గురించి ప్రస్తావిస్తూ.. నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారం (Padma Bhushan NBK) స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంటుంది. ప్రజా సేవలో, కళా సేవలో ఆయన మరిన్ని మైలు రాళ్ళు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.

అజిత్‌కు అభినందనలు
ప్రముఖ కథానాయకులు అజిత్ పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. కుటుంబ, ప్రేమ కథా చిత్రాలతో మెప్పిస్తూనే వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించారు. స్టయిల్ పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఫార్ములా–2 రేసర్‌గా ఆ రంగంలోనూ రాణిస్తున్నారు. నటుడిగా, రేసర్‌గా అజిత్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Also Read- Rithu Chowdary: వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ.. రూ. 700 కోట్ల స్కామ్‌పై రీతూ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అధికారికంగా విడుదల చేసిన ఈ లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు, అజిత్ కుమార్ అభిమానులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీ మనసు బంగారం సార్ అంటూ కొనియాడుతున్నారు. అయితే బాలయ్య అవార్డు అందుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఏమంత హడావుడి జరగకపోవడం విశేషం. అవార్డు ప్రకటించినప్పుడు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన వారున్నారు. కానీ ఇప్పుడు వారెమయ్యారో కూడా కనిపించనంతగా చాలా సైలెంట్‌గా టాలీవుడ్ ఉంది. మరోవైపు అజిత్ కుమార్ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. బాలయ్య అభిమానులు  (Nandamuri Fans) కూడా క్రాకర్స్ పేల్చి మరీ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.  బాలయ్య, అజిత్‌లతో పాటు ఇంకొందరు సెలబ్రిటీలకు ఈ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?