HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ అయిదేళ్లు నుంచి జరుగుతుంది. సినిమాకి సంబందించిన పనులు పూర్తి చేసి, రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి.
హరిహర వీరమల్లు మూవీ జూన్ 12 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పాటలు, టీజర్, గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు పెంచారు. దీంతో, హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read:Rajendra Prasad: నేనెప్పుడూ జేబు నిండిందా? లేదా? అని చూడలేదు.. ఏం చూసే వాడినంటే?
సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ట్రైలర్ జూన్ 2న విడుదల కానుందని తెలుస్తుంది. అలాగే, ఈ ట్రైలర్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై కూడా ప్లే చేస్తారని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఇప్పటి వరకు బుర్జ్ ఖలీఫా పై బాలీవుడ్ మూవీస్ పై ప్రమోషన్స్ జరిగాయి కానీ తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. అక్కడ దాని మీద ప్లే అయితే తొలి చిత్రం పవర్ స్టార్ దే అవుతుందని అంటున్నారు.
Also Read: Lord Shiva: శివుడు స్మశానంలోనే ఎందుకు ఉంటాడు.. ఎవరికి తెలియని భయంకరమైన రహస్యాలు