Rajendra Prasad
ఎంటర్‌టైన్మెంట్

Rajendra Prasad: నేనెప్పుడూ జేబు నిండిందా? లేదా? అని చూడలేదు.. ఏం చూసే వాడినంటే?

Rajendra Prasad: నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi). రాజేంద్ర ప్రసాద్ సరసన సీనియర్ నటి అర్చన నటించిన ఈ సినిమాలో మరో జంటగా రూపేశ్, ఆకాంక్ష సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ నిర్మించారు. మే 30న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో మేకర్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను ‘వంగ’ బెడుతున్నాడుగా!

‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద హీరోలు, మహానుభావులంతా ఉన్నారు. మీకంటూ ఉన్న ప్రత్యేకత ఏంటి? అని అన్న ఎన్టీఆర్ నన్ను అడిగారు. ఆ ప్రశ్నతో నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. ఓ వారం రోజులు పాటు అదే విషయాన్ని ఆలోచిస్తూనే ఉండిపోయాను. అప్పుడే చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ సినిమాలు చూశాక నాకో ఐడియా తట్టింది. అందరికీ ఓ సెపరేట్ మార్క్ రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరో అని ఉన్నప్పుడు.. కామెడీ హీరో అని ఎందుకు ఉండకూడదని అనుకున్నాను. ఇక కామెడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలని చేయాలని, కామెడీ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాను. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం, పరిస్థితి నాకు రాలేదు. నా జీవితంలో ఎప్పుడూ కూడా జేబు నిండిందా? లేదా? అనేది చూడలేదు. నేను చేస్తున్న జాబు సంతృప్తిని ఇచ్చిందా? లేదా? అనేది మాత్రమే చూశాను. ఏడాదికి పన్నెండు చిత్రాలు చేశాను. ఎంతో డబ్బు సంపాదించాను. ఆ డబ్బులన్నీ కూడా పోయాయి. కానీ, ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు. నేను చేస్తున్న పని, వేస్తున్న పాత్రలే సంతృప్తినిస్తుంటాయి. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇప్పటికీ పని దొరుకుతూనే ఉంది. గత 48 ఏళ్లుగా పని దొరుకుతూనే ఉంది. ఇప్పుడు నా చేతిలో 11 ప్రాజెక్టులున్నాయి. ఇంకో నాలుగు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

Also Read- Hombale Films: సూపర్ స్టార్‌తో సినిమా సెట్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. ఇది వేరే లెవల్!

నేను, అర్చన కలిసి ‘లేడీస్ టైలర్’ సినిమా చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు ‘షష్టిపూర్తి’ మూవీ చేశాం. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో? మధ్యలో ఎందుకు కలిసి చేయలేకపోయామో నాకు కూడా తెలియడం లేదు. ఆమె ‘దాసి, నిరీక్షణ’ అంటూ వేరే జానర్‌లోకి వెళ్లిపోయారు. నేను నా కామెడీ జానర్‌ని వెతుక్కున్నాను. నేను ఎప్పుడూ కూడా నా సినిమాలో ఆ హీరోయిన్‌ను పెట్టండి, ఈ హీరోయిన్‌ను పెట్టండి అని అడగలేదు. ఆ అలవాటు నాకు లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా ‘షష్టిపూర్తి’ చేయడం ఆ దైవ నిర్ణయమే అని నేను భావిస్తున్నాను. మధ్యలో ఎక్కడా ఆమెను నేను కలిసింది కూడా లేదు. ‘షష్టిపూర్తి’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, అందరినీ ఏడిపిస్తాను. ఈ మూవీని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారని మాత్రం చెప్పగలను. అంత మంచి ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం కామెడీ, కామెడీ చిత్రాలు తగ్గాయనే చెబుతాను. దానికి ప్రధాన కారణం రచయితలు. మా టైమ్‌లో అద్భుతమైన కామెడీని రాసేవారు. అప్పట్లో హెల్దీ కామెడీతోనే అందరినీ నవ్వించాను. ఇప్పుడు అలాంటి కామెడీ టైమింగ్, కామెడీ రైటింగ్ కానీ నాకు ఎక్కడా కనిపించడం లేదు. ‘రాబిన్ హుడ్‌’లో వెన్నెల కిశోర్‌తో నా ట్రాక్‌ను అందరూ ఎంజాయ్ చేశారు. మంచి కామెడీ ఇప్పుడు మిస్ అవుతోందని నేను కూడా ఎక్కువగా బాధపడుతుంటాను. ‘అహ నా పెళ్లంట’ బ్లాక్ బస్టర్ తర్వాత నాకు ఎక్కువ భయం వేసింది. మళ్లీ అలాంటి సినిమా వస్తుందా? అని అనుకున్నాను. ప్రస్తుతం ఉన్న కామెడీ ఇంకా బెటర్ అవ్వాలని కామెడీని నమ్ముకున్న ఓ కళాకారుడిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..