Actress Poojitha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Actress Poojitha : నా భర్తే నా ఇంట్లో చోరీ చేశాడంటూ సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటి పూజిత

Actress Poojitha : సినీ ఇండస్ట్రీలో నటి నటులు ఎన్నో కష్టాలు పడతారు. కొందరు వాటిని చెప్పుకుంటారు. మరి కొందరు చెప్పుకోలేరు. అయితే, తాజాగా సీనియర్ నటి పూజిత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, తన భర్తే తన రియల్ లైఫ్ లో శత్రువని ఏడ్చుకుంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Ponnam Prabhakar: అక్రమ నల్లా కనెక్షన్లపై కఠినంగా వ్యవహరించాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశం!

తమిళ, తెలుగు,మలయాళ, కన్నడ భాషల్లో మొత్తం 138 సినిమాల్లో నటించి.. తెలుగులో 70 సినిమాలకు పైగా నటించి అందర్ని మెప్పించిన సీనియర్ నటి పూజిత లాంగ్ గ్యాప్ తర్వాత మీడియాలో మెరిశారు. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ మూవీతో పాపులర్ అయిన పూజిత.. ఆ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌కి రెండో భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే, ఆమె నిజ జీవితంలో కూడా రెండో భార్యగానే మిగిలిపోయింది.

జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా.. 

14 ఏళ్ళ పాటు పూజిత, విజయ గోపాల్‌లు కలిసి ఉండి.. ఒక బాబు పుట్టిన తర్వాత పూజితకు తన భర్త నరకం చూపించాడు. ఇద్దరికీ పుట్టిన కొడుకుకి ఏడేళ్ల వయసు వచ్చాక విజయ గోపాల్ ఆమెను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద దుమారమే రేపింది. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ కొందరి జీవితాలు ఇలాగే ఉంటాయి అనుకుంటా.. అందరిలాగే నేను కూడా అలాంటి బాధలు పడ్డాను అంటూ తన రియల్ లైఫ్ లో జరిగిన చీకటి కోణాల్ని బయటకు వెల్లడించింది.

Also Read: Lord Shiva: శివుడు స్మశానంలోనే ఎందుకు ఉంటాడు.. ఎవరికి తెలియని భయంకరమైన రహస్యాలు

రూ.2.5 కోట్ల విలువైన బంగారు అభరణాలు చోరీ

ఆమె మాట్లాడుతూ ” నా భర్త నా నగలు, డబ్బులు అన్ని దాటించేశాడు. నేను షూటింగ్స్ కి వెళ్తాను గా , బీరువా పైన తాళాలు పెట్టె అలవాటు నాకు. దేవుడు తర్వాత ఆడ వాళ్ళు మొగుడును నమ్ముతారు. ఇంట్లో తాళాలను ఇంట్లోనే పెట్టి వెళ్తాం కదా.. ఇంట్లో వస్తువులు మాయం అవ్వడం చూసి అనుమానం వచ్చింది. అప్పటికే అన్ని తీసుకెళ్లిపోయాడు. ఈ కాలంలో అంత గోల్డ్ కొనాలంటే రెండున్నర కోట్లు పైనే ఉంటుందని ” ఏడ్చుకుంటూ చెప్పింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!