Hanu Man: 2024లో విడుదలైన తెలుగు సూపర్‌హీరో చిత్రం హనుమాన్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులు సాధించి తెలుగు సినిమా సత్తాను చాటింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, భారతీయ సంస్కృతి, మిథాలజీని, యాక్షన్‌తో అద్భుతంగా మేళవించి ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘రెండు కేటగిరీల్లో ‘హనుమాన్’ సినిమాకు ఈ అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నందు, పృథ్వీలకు, ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ వెంకట్ కుమార్ జెట్టికి నా శుభాకాంక్షలు. ఈ సినిమాకు పనిచేసిన యాక్టర్స్, టెక్నీషియన్స్ నిర్మాతలు అందరికీ నా ధన్యవాదాలు. మా సినిమాను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు.’ అంటూ తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
Read also- Clerk Assets: జీతం రూ.15 వేలు.. కానీ, 24 ఇళ్లు, 40 ఎకరాలు సంపాదించాడు
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్
హనుమాన్ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అసాధారణమైన డిజైన్, పవర్‌ఫుల్ యాక్షన్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నందు, పృథ్వీలు ఈ విభాగంలో అవార్డు అందుకున్నారు. అంజనాద్రి గ్రామ నేపథ్యంలో హనుమంతు పాత్ర హనుమాన్ శక్తులను పొందిన తర్వాత జరిగే యుద్ధ సన్నివేశాలు, శత్రువులతో జరిగే హై-ఆక్టేన్ ఫైట్స్ విజువల్‌గా, ఎమోషన్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలు భారతీయ మిథాలజీని సూపర్‌హీరో శైలితో మిళితం చేసి, యాక్షన్ సీక్వెన్స్‌లకు కొత్త ఒరవడిని అందించాయి. ఈ విజయం తెలుగు సినిమాలో యాక్షన్ డిజైన్ యొక్క ఉన్నత స్థాయిని ప్రపంచానికి చాటింది.
Read also- National Film Awards: 71వ జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్
హనుమాన్ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ భారతీయ సినిమా సాంకేతికతలో ఒక మైలురాయిగా నిలిచాయి. వెంకట్ కుమార్ జెట్టి వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా, ఫ్లిక్స్‌విల్లే, విసికేఫీ స్టూడియోల సహకారంతో రూపొందిన ఈ ఎఫెక్ట్స్ చిత్రానికి జీవం పోశాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హనుమాన్ ఫోటోరియలిస్టిక్ రూపం, 3D యానిమేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అంజనాద్రి గ్రామం, దివ్యమైన శక్తుల చిత్రీకరణ, హనుమంతుడి అతీంద్రియ సామర్థ్యాలు విజువల్‌గా అద్భుతంగా చూపించారు. ఈ విభాగంలో అవార్డు సాధించడం ద్వారా, హనుమాన్ భారతీయ సినిమాలో వీఎఫ్ఎక్స్, యానిమేషన్ సాంకేతికతలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ రెండు అవార్డులు హనుమాన్ చిత్రం టెక్నికల్ ఎబిలిటీ, కథన బలం, సాంస్కృతిక సందేశాన్ని దేశానికి తెలిసేలా చేశాయి. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ చిత్రం, 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ అవార్డులు తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక చిత్రాలకు తెలుగు సినిమా పరిశ్రమ కేరాఫ్ అడ్రస్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.