New-GST-Rates
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

GST On Movie Tickets: కొత్త జీఎస్టీ ఎఫెక్ట్.. సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గనున్న మూవీ టికెట్ ధరలు

GST On Movie Tickets: దేశంలోని సామాన్య ప్రజానీకంపై ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం… జీఎస్టీ శ్లాబులను నాలుగు నుంచి రెండుకు కుదించిన విషయం తెలిసిందే. నూతన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో, వినోదరంగంలో ప్రధానమైన సినిమా థియేటర్లలో (GST On Movie Tickets) టికెట్ రేట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింగ్స్‌ రేట్లు ప్రభావితం కానున్నాయి. జీఎస్టీ రేట్ల సవరణతో సినిమా టికెట్ల నుంచి పాప్‌కార్న్ టబ్స్‌, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్ రేట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

సినిమా టికెట్ల రేట్ల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. రూ.100 లోపు సినిమా టికెట్లపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో, వంద రూపాయల లోపు టికెట్లు రేట్లు కొంతమేర తగ్గనున్నాయి. ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, చిన్న పట్టణాల్లోని థియేటర్లలో సినిమాలు వీక్షించే ప్రేక్షకులకు కాస్త ఉపశమనం దక్కనుంది. అయితే, రూ.100 కంటే ఎక్కువ రేటు ఉన్న టికెట్లపై మాత్రం 18 శాతం జీఎస్టీ రేటు యథావిథిగా కొనసాగుతుంది. కాబట్టి, మల్టీప్లెక్సులు, ప్రీమియం థియేటర్లు, పెద్దపెద్ద నగరాల్లో ఉండే థియేటర్లలో టికెట్ రేట్లపై జీఎస్టీ రేటు మార్పు ఎలాంటి ప్రభావం చూపబోదు.

Read Also- CM Revanth Reddy: వందేళ్లలో రానంత వరద.. కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ.. సీఎం రేవంత్ హామీ

మొత్తంగా, బడ్జెట్‌లో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే యువత, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు జీఎస్టీ రేట్ల సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వ స్వల్ప ఊరట కలిగించింది. ఉదాహరణగా చూస్తే, ఇప్పటివరకు రూ.90 టికెట్‌ మూవీ టికెట్ జీఎస్టీతో కలిసి రూ.100.80 అవుతోంది. సెప్టెంబర్ 22 నుంచి ఇది రూ..94.50కు తగ్గుతుంది. టికెట్ రేటు తగ్గేది స్వల్పమే అయినా, ఫ్యామిలీ లేదా బ్యాచ్‌గా కలిసి సినిమాకి వెళ్తే ఈ తేడా గణనీయంగా కనిపిస్తుంది.

మరి పాప్‌కార్న్ రేట్ల సంగతేంటి?

పాప్‌కార్న్ తింటూ మూవీ చూడడంలో ఉండే కిక్కే వేరు. అయితే, మూవీ థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎంతగా అంటే, అధిక ధరలకు కారణమవుతున్న జీఎస్టీపై ఇప్పటికే చాలా జోకులు, మీమ్స్ పేలాయి. అయితే, పాప్‌కార్న్‌పై వివాదాస్పద రీతిలో అధికంగా ఉన్న జీఎస్టీ రేటుకు జీఎస్టీ కౌన్సిల్ ఒక పరిష్కారాన్ని చూపించింది. పాప్‌కార్న్‌పై జీఎస్టీ ట్యాక్స్ విధింపు విధానాన్ని సులభతరం చేసింది. ఉప్పు, లేదా మసాలా పాప్‌కార్న్‌పై జీఎస్టీని 5 శాతంగా కౌన్సిల్ నిర్ణయించింది. పాప్‌కార్న్‌ను లూజుగా విక్రయించినా, ప్యాకింగ్ చేసి విక్రయించినా ఇదే రేటు వర్తిస్తుంది.

కారమెల్ పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీ

కారమెల్ పాప్‌కార్న్‌పై (తీపిగా ఉండే ) జీఎస్టీని 18 శాతంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇది షుగర్ కన్ఫెక్షనరీ కేటగిరిలోకి వస్తుంది కాబట్టి ఎక్కువ ట్యాక్స్ విధిస్తున్నట్టు జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. గతంలో పాప్ రకాన్ని బట్టి కాకుండా ప్యాకేజింగ్ ఆధారంగా ట్యాక్స్ మారుతుండేది. ఉదాహరణగా చూస్తే లుజ్‌గా విక్రయించే సాల్ట్ పాప్‌కార్న్‌పై జీఎస్టీ 5 శాతంగా, ప్యాక్ చేసినదానిపై జీఎస్టీ 12 శాతంగా ఉండేది. రేట్ల సవరణతో ధరల్లో మార్పులు రానున్నాయి.

Read Also- IBPS RRB Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 13,217 పోస్టులు..

ఇక, కూల్‌డ్రింక్స్ విషయానికి వస్తే, కోక్, పెప్సీ, రెడ్ బుల్ వంటి ఎరేటెడ్ (కార్బొనేషన్‌తో వాయువులు నిండినవి), కేఫీన్ ఉన్న డ్రింక్స్‌పై 28 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. అంటే, రూ.350 ధర ఉన్న కోక్ ఇప్పుడు సుమారుగా రూ.448కు పెరుగుతుంది. మరోవైపు, థియేటర్లలో తాగునీరుపై (20 లీటర్ ప్యాక్స్) జీఎస్టీ 5 శాతానికి తగ్గింది. అయితే, చిన్న బాటిళ్ల రేట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఇక, ప్లాంట్ ఆధారిత మిల్క్ డ్రింక్స్, సోయా మిల్క్ వంటి పానియాలపై జీఎస్టీ 12-18 శాతం కేటగిరి నుంచి 5 శాతానికి తగ్గింది. కాబట్టి, ఈ మార్పులతో కొన్ని డ్రింక్స్ చౌకగా, మరికొన్ని ఖరీదైనవిగా మారే అవకాశాలు ఉన్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!