Sunita Ahuja interview: బాలీవుడ్ స్టార్ నటుడు గోవింద వ్యక్తిగత జీవితంపై ఆయన భార్య సునీత అహుజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సుదీర్ఘ కాలంగా గోవిందతో వివాహ బంధంలో ఉన్న సునీత, ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ వైవాహిక జీవితంలోని కష్టాల గురించి, ముఖ్యంగా తన భర్త ఇతర మహిళలతో ఉన్న సంబంధాల గురించిన పుకార్లపై నిర్మొహమాటంగా మాట్లాడారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Gatha Vaibhavam trailer: దుష్యంత్ ‘గతవైభవం’ ట్రైలర్ వచ్చేసింది.. సినిమా విడుదల ఎప్పుడంటే?
‘హీరోయిన్లతోనే ఎక్కువ సమయం’
గోవింద ఒక స్టార్ కావడం వల్ల తమ జీవితంలో ఎదురైన సవాళ్లను సునీత వివరించారు. “గోవింద ఒక హీరో. నేను ఏం చెప్పగలను? భార్యలతో గడిపే సమయం కంటే ఆయన హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు,” అని ఆమె స్పష్టం చేశారు. ఒక స్టార్ భార్యగా ఉండాలంటే గుండెను రాయిగా మార్చుకోవాల్సి ఉంటుందని, ఈ విషయం తమ 38 ఏళ్ల వివాహ జీవితంలో ఆమెకు అర్థమైందని తెలిపారు. యవ్వనంలో ఆ ప్రేమలో ఇవన్నీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. గోవిందకు ఒక 30 ఏళ్ల మరాఠీ నటితో ఎఫైర్ ఉందనే పుకార్లపై సునీత స్పందిస్తూ, “ఆ పుకార్లను నేను కూడా విన్నాను, కానీ, కళ్ళారా చూసేంతవరకు లేదా రెడ్ హ్యాండ్‌గా పట్టుకునేంతవరకు నేను దానిని ఖరారు చేయలేను. కానీ, పుకార్లు అయితే వింటున్నాను,” అని చెప్పారు.
Read also-Andesri Passed Away: అస్తమించిన అందెశ్రీ.. ప్రముఖుల సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
తరువాత జరిగిన మరో ఇంటర్వ్యూలో ఆమె మరింత సూటిగా మాట్లాడుతూ, “తప్పులు చేయనివారు లేరు. యవ్వనంలో తప్పులు చేస్తారు, నేను చేశాను, గోవింద కూడా చేశారు. కానీ ఒక వయసు వచ్చాక, పిల్లలు పెద్దయ్యాక కూడా తప్పులు చేస్తే బాగుండదు. ఎందుకు చేయాలి? మీకు ఒక అందమైన కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు?” అని ప్రశ్నించారు. తప్పులు చేసినందుకు గోవిందను తాను ఎప్పుడూ క్షమిస్తూనే ఉన్నానని, కానీ తాను మాత్రం ఎందుకు క్షమించాలో ఆయనను అడగాలనుకుంటున్నానని సునీత అన్నారు. “ఆయన చాలా మంచి కొడుకు, చాలా మంచి సోదరుడు, కానీ మంచి భర్త మాత్రం కాదు” అని సునీత నిర్మొహమాటంగా చెప్పారు. అందుకే, రాబోయే జన్మలో గోవింద తనకు భర్తగా వద్దు, ఒకవేళ పుట్టాలనుకుంటే తన కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పడం ఈ వ్యాఖ్యలలో అత్యంత సంచలనాత్మకమైనది. ఈ తాజా వ్యాఖ్యలు గోవింద, సునీత వైవాహిక జీవితం గురించి బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై స్పందించిన నెటిజన్లు వైవాహిక జీవితంపై ఇలా బహిరంగంగా చెప్పడం సబబుకాదని అంటున్నారు. మరికొందరు అయితే ఆమె ఎంతెలా బాధ పడితే ఈ వ్యాఖ్యలు చేయాల్ని వచ్చిందో అని ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు.
