Genelia
ఎంటర్‌టైన్మెంట్

Genelia: ఇతరులను నమ్మడానికిలేదు.. జెనీలియా జ్ఞానోపదేశం

Genelia: జెనీలియా.. ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా, అల్లరిపిల్లగా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా, ‘బొమ్మరిల్లు’ సినిమా తర్వాత టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో కొన్ని గుర్తుండిపోయే సినిమాలలో నటించిన జెన్నీ, ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొని మళ్లీ ముంబై చెక్కేసింది.

Also Read- Mega 157: ఉగాది రోజున మెగా ట్రీట్ .. ఒకే ఫ్రేమ్ లో చిరు, వెంకీ.. ఫ్యాన్స్ కు పండుగే..!

వాస్తవానికి ఆమెది ముంబై. అక్కడి నుంచి వచ్చిన ఈ భామ ‘బొమ్మరిల్లు, ఢీ, రెడీ, సై’ వంటి చిత్రాలలో నటించి, తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను , ఆమె నటనను ఎంతగానో ఇష్టపడ్డారు. ఇక పెళ్లి అనంతరం ఆమె నటనకు గ్యాప్ ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసిన జెనీలియా, తనలాంటి వాళ్లకు ఇప్పుడో జ్ఞానోపదేశం చేసింది. అదేంటంటే..

దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నటించాలని అనుకున్నప్పుడు, అంతా ప్రోత్సాహిస్తారని అనుకుందట, కానీ, ఊహించని విధంగా కొందరి నుంచి వచ్చిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధ పెట్టాయని తెలిపింది జెనీలియా. ఈ విషయాన్ని స్వయంగా ఆమె పాల్గొన్న ఓ ఈవెంట్‌లో తెలపడం విశేషం. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒక నటిగా నేను ఆరు భాషల్లో పనిచేశాను. కెరీర్ పరంగా, నటన పరంగా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ని ఎప్పుడూ లెక్క చేయలేదు. కష్టం సుఖం.. జయాపజయాలు మన లైఫ్‌లో కామన్. అందుకే వీటన్నింటికంటే కూడా, మనం మన లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నామనేదే ఇక్కడ ముఖ్యం. పెళ్లి, పిల్లలు తర్వాత ఇక యాక్టింగ్ వద్దని అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ కొనసాగించాలని అనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళెవ్వరూ నన్ను ప్రోత్సహించలేదు. పదేళ్లు అవుతుంది. ఇప్పుడు యాక్టింగ్ నీకు వర్కవుట్ కాదు అని అన్నారు. వారిమాటలు తీవ్ర నిరాశకులోనయ్యేలా చేశాయి. అయినా కూడా ధైర్యంగా అడుగు వేశాను. రితేష్‌తో చేసిన ‘వేద్’ నాకు గ్రాండ్ రీ ఎంట్రీగా నిలబడింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను అందరికీ ఒక విషయం చెప్పదలచుకున్నాను. అన్ని విషయాలలో ఇతరులు మన గురించి చెప్పే విషయాలను నమ్మవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. సక్సెస్ దానంతట అదే వస్తుంది’’ అని జెనీలియా చెప్పుకొచ్చారు.

Also Read- Peddi: మెగా అలెర్ట్.. శ్రీరామనవమికి సిద్ధంకండమ్మా!

‘వేద్’ విషయానికి వస్తే.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చారు. ‘మజిలీ’ చిత్రానికి రీమేక్‌గా మరాఠీలో రూపొందిన చిత్రమిది. ఇందులో గృహిణి పాత్రలో జెనీలియా నటనకు ప్రశంసలు పడుతున్నాయి. అలాగే ఈ సినిమాతో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ దర్శకుడిగానూ అరంగేట్రం చేశారు. తన భర్త డైరెక్ట్ చేసిన తొలి సినిమాలో నటించినందుకు జెనీలియా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!