Peddi Movie Poster (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Peddi: మెగా అలెర్ట్.. శ్రీరామనవమికి సిద్ధంకండమ్మా!

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అలెర్ట్ అవ్వండి.. ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది. రీసెంట్‌గా రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా ‘పెద్ది’ టైటిల్ లుక్ పోస్టర్ వదిలిన మేకర్స్.. రాబోయే శ్రీరామనవమి స్పెషల్‌గా ఏప్రిల్ 6వ తేదీన మెగా ట్రీట్‌ రెడీ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఉగాది పండుగ శుభాకాంక్షలతో ‘పెద్ది’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే. ఏప్రిల్ 6వ తేదీన ‘పెద్ది ఫస్ట్ షాట్’ పేరుతో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయం తెలుపుతూ వదిలిన ప్రీ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ ఊర మాస్ అవతార్‌లో గాలిలో జంప్ చేస్తున్నారు. చుట్టూ ఉన్న జనాలు విజయానికి ప్రతీకగా నిలిచే జెండాలతో, రామ్ చరణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read- Mega 157: ఉగాది రోజున మెగా ట్రీట్ .. ఒకే ఫ్రేమ్ లో చిరు, వెంకీ.. ఫ్యాన్స్ కు పండుగే..!

ప్రస్తుతం రామ్ చరణ్ తన అభిమానులను సాలిడ్ హిట్‌తో సంతృప్తి పరచాల్సి ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గేమ్ చేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించలేకపోయింది. తమిళ సంచలన దర్శకుడు శంకర్ ఆ సినిమాకు డైరెక్టర్ అని తెలియగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ, ఆ అంచనాలకు అనుగుణంగా సినిమా లేకపోవడంతో, ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్‌ని ఫేస్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నింటినీ ‘గేమ్ చేంజర్’ డిజప్పాయింట్ చేసింది. అందుకే బుచ్చిబాబు సానాతో చేస్తున్న ఈ ‘పెద్ది’ సినిమాపై భారీ అంటే భారీగా అంచనాలను పెట్టేసుకున్నారు. చిన్న అప్డేట్ వస్తే చాలు.. సోషల్ మీడియా షేక్ అయ్యేలా చేస్తున్నారు.

‘పెద్ది’ విషయానికి వస్తే.. రామ్ చరణ్ 16వ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ పాన్-ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ హ్యూజ్ బ‌డ్జెట్ మూవీని వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా త‌న లుక్‌ను ర‌గ్డ్‌గా మార్చుకోవ‌టం విశేషం. ఈ రా క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌టానికి ఆయ‌న స్టార్ ఇమేజ్‌ను సైతం ప‌క్క‌న పెట్టి ఇంటెన్స్‌, రియ‌ల్‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Also Read- Andhrula Annapurna Dokka Seethamma: డబ్బు కోసం కాదు.. మెగా, పవర్ స్టార్‌లకు అంకితమిస్తూ అభిమాని సాహసం

అసలు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, అసలు ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందని ఎంతగానో వేచి చూస్తున్న వారందరికీ టైటిల్ లుక్‌తో వదిలిన పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు బుచ్చిబాబు. ప‌దునైన చూపులు, గుబురు గ‌డ్డం, ముక్కుకి రింగు, మాసిన బ‌ట్ట‌లు, సిగ‌రెట్ తాగుతూ తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే అవ‌తార్‌లో రామ్ చరణ్‌ని చూసి గురువు సుకుమార్ ‘రంగస్థలం’లో చూపించింది చాలా తక్కువ.. శిష్యుడు ఇవ్వబోతున్నాడు అసలు సిసలైన మాస్ ట్రీట్ అనేలా టాక్ వచ్చిందంటే.. ఇందులో రామ్ చరణ్‌ని బుచ్చి మామ ఎలా చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ క‌రుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌ పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే జ‌గ‌ప‌తిబాబు, దివ్యేందు శ‌ర్మ ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎ.ఆర్‌. రెహ‌మాన్ త‌న‌దైన బాణీల‌తో మ‌రుపురాని సంగీతాన్ని అందించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు